కిర్రాక్ పార్టీ టీజింగ్ ట్రైలర్ ను విడుదల చేసిన డైరెక్టర్ తేజ…

మంచి కథలను ఎంపిక చేసుకొని వరుస విజయాలతో దూసుకెళుతున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ తాజాగా ఎ టివి సమర్పణలో ఎ కె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించు కిర్రాక్ పార్టీ చిత్రంలో నటిస్తున్నారు.. ఈ చిత్రానికి నిర్మాత రామ బ్రాహ్మమ్ సుంకర  కాగా, దర్శకుడు శరన్ కొప్పిశెట్టి. ఈ చిత్రం లో నిఖిల్ కు జంటగా సిమ్రాన్ పరీన్జా, సంయుక్త హెగ్డే నటిస్తున్నారు ఈ సినిమా టీజింగ్ ట్రైలర్ ను బుధవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో దర్శకుడు తేజ అతిథిగా విచ్చేసి  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాత అనిల్ సుంకర బ్యానర్లో సినిమా చేస్తున్నా… అందుకే రావడం జరిగింది.. ఇక టీజర్ అయితే మళ్లీ.. మళ్లీ చూసేలా అనిపిస్తోంది.. నిఖిల్ కు స్నేహితులుగా నటించిన వారందరూ చాలా న్యాచురల్ గా ఫ్రెష్ గా ఉన్నారు.. తప్పకుండా సినిమా బాగుంటుందని ఆసిస్తూ.. అందరికీ మంచి పేరు తెచ్చేలా ఉంటుందని భావిస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా అన్నారు.. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ… టీం అంతా చాలా అనుభవం ఉన్నవాళ్ళలా చేశారు.  చాలా బాగొచ్చింది.. కాలేజ్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అని చెప్పారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ ఈ చిత్రం లో నేను లీడర్ అయినా మా లీడర్  మాత్రం నిర్మాత అనిల్ సుకర గారే ..హ్యాపీ డేస్ సినిమాతో ఇలానే కొత్తవారితో కలసి పనిచేసే అదే ఫీల్ ఇప్పుడు ఈ కిర్రాక్ పార్టీ చిత్రం తో కలుగుతోంది. సినిమా షూటింగ్ పూర్తి అయ్యేటప్పుడు మేము అంతా ఏడ్చేశాము.. చాలా… చాలా ప్రత్యేకమైన సినిమా నాకు.. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది… హీరోయిన్స్ ఇద్దరూ బాగా నటించారు.. అందరికీ మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నా అన్నారు. ఇక దర్శకుడు శరన్ మాట్లాడుతూ కన్నడలో బిగ్గెస్ట్ ఫిల్మ్ కిర్రిక్ పార్టీ… ఆ ఫ్లావర్ పోకుండా తెలుగు నేటివిటీ కి తగ్గట్టు చిత్రీ కరించాము.. అవకాశం ఇచ్చిన నిఖిల్ కు, నిర్మాతలకు నా కృతఙ్ఞతలు అని అన్నారు.
హీరోయిన్స్ సిమ్రాన్ పరీన్జా,  సంయుక్త హెగ్డే, రాజా రవీంద్ర, సుధీర్ వర్మ, అభిషేక్ అగర్వాల్, అజనీష్, కిషోర్ గరికపాటి మరియు ఇతర నటులంతా.. పాల్గొన్నారు..
నిఖిల్, సిమ్రాన్ పర్జీనా, సంయుక్త హెగ్డే, బ్రహజీ, సిజ్జు, రఘు కారుమంచి, షియాజి షిండే తదితరులు ప్రధాన పాత్ర దారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ, డైలాగ్స్: చందూ మొండేటి, సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి, సంగీతం: అంజనీష్ లోకనాథ్, ఎడిటర్: ఎమ్. ఆర్ వర్మ, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ లోకేష్, కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, ఫైట్స్: వెంకట్, కొరియోగ్రఫీ: అని, విజయ్, అవినాష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here