కీర్తిసురేష్ దున్నేస్తుందిగా.. ఖాతాలో మ‌రోటి..!


ఒక్కోసారి హీరోయిన్ల కెరీర్ కు మ‌ధ్య‌లో భారీ గ్యాప్ వ‌స్తుంది. దాన‌ర్థం వాళ్లు తెర‌కు దూర‌మ‌య్యార‌ని కాదు.. తుఫాన్ ముందు ప్ర‌శాంత‌త అని. ఇప్పుడు కీర్తిసురేష్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. గ‌తేడాది ఈమె నుంచి రెండు సినిమాలే వ‌చ్చాయి. తెలుగులో నేనులోక‌ల్.. త‌మిళ్ లో భైర‌వా. అలాగ‌ని కీర్తిని త‌క్కువంచ‌నా వేస్తే ఇంకేం లేదు. ఎందుకంటే 2018 సంక్రాంతి నుంచే త‌న హవా చూపించ‌బోతుంది కీర్తి. ఈ ఏడాదంతా కీర్తి నామ సంవ‌త్స‌రంగా మార‌బోతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్-త్రివిక్ర‌మ్ అజ్ఞాత‌వాసి సినిమాలో మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది కీర్తిసురేష్. జ‌న‌వ‌రి 10న ఈ చిత్రం విడుద‌ల కానుంది. దీనికి తోడు సూర్య-విఘ్నేష్ శివ‌న్ సినిమాలోనూ ఈమె హీరోయిన్. ఈ చిత్రం కూడా జ‌న‌వ‌రి 12నే విడుద‌ల కానుంది. అంటే తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో సంక్రాంతికే రానుంద‌న్న‌మాట‌.
ఇక మ‌హాన‌టి సినిమాలోనూ ఈమె హీరోయిన్. ఇది బై లింగువ‌ల్ ప్రాజెక్ట్.. అందుకే రెండు భాష‌ల్లో ఇమేజ్ ఉన్న కీర్తినే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక సీక్వెల్ హీరోయిన్ గానూ కీర్తిసురేష్ కు పేరుంది. విక్ర‌మ్-హ‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ సామి 2.. లింగుస్వామి-విశాల్ పందెంకోడి 2ల్లో కీర్తిసురేష్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసారు. ఈ విష‌యం త‌నే ట్విట్ట‌ర్ లో అప్ డేట్ చేసింది కీర్తి. ఇక ఇప్పుడు విజయ్-మురుగ‌దాస్ సినిమాలోనూ కీర్తినే హీరోయిన్ గా తీసుకున్నారు. అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా ఇచ్చారు చిత్ర‌యూనిట్. ఇదివ‌ర‌కే విజ‌య్ తో క‌లిసి భైర‌వాలో న‌టించింది కీర్తిసురేష్. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా మ‌రోసారి కాంబినేష‌న్ రిపీట్ చేస్తున్నాడు ఇళ‌య ద‌ళ‌ప‌తి. ఇవ‌న్నీ హిట్ట‌యితే టాప్ చైర్ అఫీషియ‌ల్ గా అధిష్టిస్తుంది కీర్తిసురేష్. మొత్తానికి క్వీన్ ఆఫ్ 2018గా మారిపోతుంది కీర్తిసురేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here