కీర్తిసురేష్ @ మ‌హాన‌టి..!


కెరీర్ మొద‌లుపెట్టి మూడేళ్లు కూడా కాలేదు.. అప్పుడే మ‌హాన‌టి అయిపోయింది కీర్తిసురేష్. కెరీర్ లో చాలా మందికి అరుదుగా ద‌క్కే గౌర‌వం ఇది. ఏకంగా సావిత్రి పాత్ర‌లోనే న‌టించ‌డం.. ఆ పాత్ర‌కు ఈమె ప్రాణం పోయ‌డం.. చూసిన వాళ్లంతా సావిత్రి మ‌ళ్లీ బ‌తికొచ్చిందా అని ప్ర‌శంసించ‌డం..
ఈ త‌రంలో ఏ హీరోయిన్ కు ద‌క్కే గౌర‌వం ఇది..? ఇప్పుడు కీర్తిసురేష్ కు ఇదంతా జ‌రుగుతుంది. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న మ‌హాన‌టి విడుద‌లైంది. ఇందులో అభిన‌వ సావిత్రిగా కీర్తిసురేష్ న‌టించ‌లేదు.. జీవించింది. ఆమెను చూసిన వాళ్ళెవ్వ‌రైనా ఒక్క‌సారైనా చేతులెత్తి దండం పెట్టేలా చేసింది అభిన‌యం.
ఇక ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కూడా త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వంద‌శాతం నిల‌బెట్టుకుంది కీర్తిసురేష్. ముఖ్యంగా జెమినీ గ‌ణేష‌న్ తో విడిపోయే సీన్ లో అయితే కీర్తిసురేష్ లోకి నిజంగానే సావిత్రి వ‌చ్చేసింది.. ఇక క్లైమాక్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అంత‌గా ఈ పాత్ర‌లోకి ఒదిగిపోయింది కీర్తిసురేష్. ఈ పాత్ర‌తో క‌చ్చింత‌గా ఆమెకు ఎన్ని అవార్డులు వ‌రిస్తాయో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here