కుర్రాడు ఏదో చేసేలా ఉన్నాడుగా..!


నాగ్ అశ్విన్.. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కూడా ఈ పేరుతో ఎవ‌రికీ పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు కానీ స‌రిగ్గా ఓ వారం త‌ర్వాత ఈ పేరు మాత్రం తెలుగుతో పాటు అన్ని ద‌క్షిణాది ఇండ‌స్ట్రీల్లో మారుమోగ‌డం ఖాయం. ఎందుకంటే ఈయ‌న చేస్తోన్న సినిమా అలాంటిది మ‌రి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ సాహ‌సించ‌ని విధంగా సావిత్రి బ‌యోపిక్ నే తెర‌కెక్కించాడు నాగి.
మూడేళ్ళ త‌న క‌ల‌ను నెర‌వేర్చుకున్నాడు. ఇప్పుడు అది విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇన్నాళ్లూ ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుందో అనే క్లారిటీ ఉండేది కాదు కానీ ఇప్పుడు విడుద‌లైన స్టిల్స్.. విజువ‌ల్స్.. మేకింగ్ చూసిన త‌ర్వాత మ‌హాన‌టి చాలా పెద్ద చిత్రం అని అర్థ‌మైపోతుంది. దీన్ని ఓ అద్భుతంగా.. మ‌హాకావ్యంలా నాగ్ తెర‌కెక్కించాడని అర్థ‌మైపోతుంది. రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత క‌చ్చితంగా నాగ్ అశ్విన్ అంద‌రికీ హాట్ ఫేవ‌రేట్ అయిపోతాడ‌న‌డంలో ఆశ్చర్య‌మేం లేదు.
ఈయ‌న ప‌నిత‌నం కూడా అలాగే ఉంది. ఇప్పుడు మ‌హాన‌టి గురించి మాట్లాడ‌టం త‌క్కువే. ఎందుకంటే రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత మ‌నోడి ప‌నేంటో సినిమానే చూపిస్తుందంటున్నారు చిత్ర‌యూనిట్ కూడా. మ‌రి చూడాలిక‌.. ఈ కుర్రాడు చేసిన మాయేంటో మే 9న తెర‌పై చూద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here