కుర్రాడు క‌చ్చితంగా కొట్టేలా ఉన్నాడుగా..!


సాధార‌ణంగా కొన్ని సినిమాలు చూస్తుంటే తెలియ‌ని వైబ్రేష‌న్స్ వ‌స్తుంటాయి. ఇది ప‌క్కా హిట్ సినిమా అని తెలిసిపోతుంటుంది ముందే. ఇప్పుడు ఛ‌లో సినిమాను చూసినా కూడా ఇదే అనిపిస్తుంది. అదేంటో తెలియ‌దు కానీ సినిమా విడుద‌ల‌కు నెల రోజుల ముందు నుంచే ఛ‌లోపై తెలియ‌ని పాజిటివ్ వైబ్రేష‌న్స్ వ‌స్తున్నాయి. ఇక ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా అంద‌రికీ క‌లిగిన భావ‌న ఇదే. బ‌య‌ట ఆఫ‌ర్లు బాగానే వ‌స్తున్నా కూడా సొంత ప్రొడ‌క్ష‌న్ లో నాగ‌శౌర్య సినిమా చేస్తున్నాడంటే అంద‌రూ ఎందుకబ్బా అనుకున్నారు. కానీ ఛ‌లో ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఎందుకో అర్థ‌మ‌వుతుంది. స్నేహితుడే ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సినిమా చేయించుకుంటున్నాడు నాగ‌శౌర్య‌. ఛ‌లో ట్రైల‌ర్ చాలా ఎంట‌ర్ టైనింగ్ గా ఉంది. సినిమా ఇంత‌కంటే వంద రెట్లు ఉంటుందంటున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌. గురువు త్రివిక్ర‌మ్ త‌ర‌హాలోనే పంచ్ డైలాగుల‌ను బాగానే పేల్చాడు వెంకీ. బాషా.. బాహుబ‌లి.. త‌ని ఒరువ‌న్.. ఇలా వ‌ర‌స‌గా అన్ని సినిమాల‌పై పంచ్ లేసాడు ద‌ర్శ‌కుడు. ఇవ‌న్నీ ట్రైల‌ర్ కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇక తెలుగు, త‌మిళ బార్డ‌ర్ క‌థ కావ‌డంతో త‌మిళ నటులు కూడా ఇందులో చాలా మంది ఉన్నారు. ఈ చిత్రంతో క‌చ్చితంగా శౌర్య పెద్ద హిట్ కొట్టేలా ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు కెరీర్ ను మార్చే హిట్ కోసం వేచి చూస్తున్నాడు ఈ కుర్ర హీరో. అది సొంత ప్రొడ‌క్ష‌న్ లోనే వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాడు ఈ హీరో. పిబ్ర‌వ‌రి 2న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మొన్న చిరంజీవి ప్రీ రిలీజ్ వేడుక‌కు రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు మరింత‌గా పెరిగాయి. క‌చ్చితంగా ఛ‌లోతో నాగ‌శౌర్య కోరుకున్న విజ‌యం ద‌క్కేలాగే క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here