కూనిరాగాలు ఆవిష్కరించిన కళాతపస్వి కె.విశ్వనాధ్

కూనిరెడ్డి శ్రీనివాస్ రాసిన కవితా సంపుటి ‘కూనిరాగాలు’ ను కళాతపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత కె.విశ్వనాధ్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని సూర్య పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత నూకారపు సూర్యప్రకాశరావు స్వీకరించారు. ఈ కవితా సంపుటిని శ్రీనివాస్.. నూకారపు సూర్యప్రకాశరావుకు అంకితమిచ్చారు. ‘కూనిరాగాలు’ చాలా బాగున్నాయని.. కూనిరెడ్డి శ్రీనివాస్ ముందు ముందు మరిన్ని పుస్తకాలు రాయాలని కె.విశ్వనాధ్ ఆశీర్వదించారు. స్వతహా మంచి సాహితీప్రియుడయిన శ్రీనివాస్ ‘కూనిరాగాలు’ పేరుతో వెలువరించిన పుస్తకాన్ని తనకు అంకితమివ్వడం సంతోషంగా ఉందని నూకారపు అన్నారు. కె.విశ్వనాధ్ వంటి లెజెండ్ తన కవితా సంపుటిని ఆవిష్కరించడం,  తన శ్రేయోభిలాషి, మార్గదర్శి సూర్యప్రకాశరావు ఈ పుస్తకాన్ని అంకితం తీసుకొని, ఈ కార్యక్రానికి హాజరై తొలిప్రతిని స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని కూనిరెడ్డి అన్నారు.
ఈ పుస్తకావిష్కరణలో ప్రముఖ దర్శకులు ‘డమరుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ రచయిత సాయినాథ్ తోటపల్లి, సంగమమ్ అకాడమీ సంజయ్ కిశోర్, డాక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here