కృష్ణార్జునులు వ‌చ్చారు.. యుద్ధం ఎలా ఉంటుందో..? 

    Natural Star Nani 'Krishnarjuna Yudham


నానితో ఇప్పుడు పోటీ ప‌డ‌టం అంటే సుసైడ‌ల్ కిందే లెక్క‌. ఈయ‌న సినిమా వ‌చ్చిందంటే పోటీ ఎవ‌రు అనే ప‌ని లేకుండా బాక్సాఫీస్ దున్నేయ‌డం కామ‌న్ అయిపోయింది. మొన్నొచ్చిన ఎంసిఏ కూడా యావ‌రేజ్ టాక్ తోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. అంత‌గా నాని టైమ్ న‌డుస్తుందిప్పుడు. ఎంసిఏ కిక్ నుంచి ఇంకా బ‌య‌టికి రాక‌ముందే అప్పుడే మ‌రో సినిమాతో వ‌చ్చేస్తున్నాడు నాని. అదే కృష్ణార్జున యుద్ధం. ఇందులో ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు ఈ హీరో. తాజాగా సంక్రాంతి సంద‌ర్భంగా ఇందులో ఉన్న కృష్ణార్జున లుక్స్ విడుద‌ల‌య్యాయి. ఇందులో కృష్ణ మాస్ అయితే.. అర్జున్ సూప‌ర్ క్లాస్. ఒక‌రు తిరుప‌తిలో ఉండే పాత్ర అయితే.. మ‌రోటి పారిస్ లో ఉంటాడు. ఈ చిత్ర హ‌క్కుల్ని 23 కోట్ల‌కు ఔట్ రేట్ గా తీసుకున్నాడు దిల్ రాజు. ఆ త‌ర్వాత ఆయ‌న ఇష్టం ఎంత‌కు అమ్ముకుంటాడు అనేది.. మొన్న ఎంసిఏనే 30 కోట్ల‌కు అమ్మితే.. 40 కోట్లు తీసుకొచ్చింది.
ఇప్పుడు ఈ బిజినెస్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. జెంటిల్ మ‌న్ లాంటి క్లాస్ టైటిల్ తో హిట్ కొట్టిన నాని.. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలో నానితో అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్, రుక్సర్ మీర్ రొమాన్స్ చేస్తున్నారు. క‌థ తిరుప‌తి.. పారిస్ నేప‌థ్యంలో జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డి అక్క‌డి నాని మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే సినిమా. ఈ మ‌ధ్యే పారిస్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాడు నాని. గ‌తంలో జెంటిల్ మ‌న్, జెండా పై క‌పిరాజు సినిమాల్లో డ్యూయ‌ల్ రోల్ చేసాడు నాని. ఇందులో జెంటిల్ మ‌న్ సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు మ‌ళ్లీ గాంధీ సినిమా కోసం డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడు నాని. ఎప్రిల్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ధృవ ఫేమ్ హిప్ హాప్ త‌మిళ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జ‌న‌వ‌రి 16 ఉద‌యం 10 గంట‌ల‌కు టైటిల్ సాంగ్ విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here