కెసిఆర్ పై ప్రశంసల జల్లు, కె.టి.ఆర్ కు సన్మానం – తెలుగు మహాసభలలో మోహన్ బాబు

ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నిర్వహిస్తున్న తెలుగు మహాసభలలో భాగంగా ప్రాముఖ్య సినీ కళాకారులకు సోమవారం నాడు సన్మానించారు. సభలో అలనాటి తారలలో జమున గారు కూడా పాల్గొనగా, డాక్టర్ మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, రాజమౌళి, వెంకటేష్, నాగార్జున, జగపతి బాబు తదితరులు కుడా స్టేజిని అలంకరించారు. సభను అద్భుతం గా నిర్వహించినందుకు గాను కెసిఆర్ గారిని ప్రశంసల జల్లు కురిపించారు.
డాక్టర్ మోహాంబ్బలు గారు సభలో ప్రశాంగిస్తూ ప్రపంచ తెలుగు మహాసభ నడపాలని, తెలుగు మర్చిపోతున్నామని, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పమని జ్ఞాపకం చేయడంకోసం అత్యద్భుతంగా ఇది నిర్వహిస్తునటువంటి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఏ స్కూల్స్ కు వెళ్లిన, మా స్కూల్స్ కు వెళ్లిన,ఇంగ్లీష్ నేర్పించండి తెలుగు భాష వద్దు అంటున్న రోజులలో తెలుగు ఎక్కడ మర్చిపోతామో,భాష ఎక్కడ చనిపోతుందో,మాతృభాషను మర్చిపోవద్దని ముఖ్యమంత్రి గారు,ఆ పోరాట యోధుడు ఇంత అద్భుతంగా సభను నిర్వహిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం సాధించాలి అని నడుంకట్టుకొని సాధించినటువంటి పోరాట యోధుడు, ఆయన ఈ రోజు మా కళాకారులందరినీ సన్మానిస్తున్నందుకు హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న కె.టి.ఆర్ గారికి ‘లీడర్ అఫ్ ది ఇయర్’ అనే అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు, నేను సొంత శాలువాతో సన్మానం చేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here