కొడుకు సినిమాకు నాగార్జున అడ్డు.. 

అదేం విచిత్ర‌మో కానీ.. మొన్న‌టికి మొన్న చిరంజీవి సినిమాకు రామ్ చ‌ర‌ణ్ అడ్డుప‌డ్డాడు. ర‌త్న‌వేలు కోస‌మ‌ని సైరా షూటింగ్ ను వాయిదా వేసారు. ఇక ఇప్పుడేమో నాగ‌చైత‌న్య సినిమాను నాగార్జున అడ్డుకుంటున్నాడు. ఇదేలా అనుకుంటున్నారా..? ఏం లేదండీ సింపుల్.. నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం స‌వ్య‌సాచి సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇందులో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్. మాధ‌వ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. చందూమొండేటి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో హీరో ఎడ‌మ చేతికి బాడీతో సంబంధం ఉండ‌దు. రెండు చేతుల‌కు ఒకే బ‌లం ఉంటుంది. అందుకే స‌వ్య‌సాచి అంటారు. భార‌తంలో అర్జునుడికి మాత్ర‌మే ఈ బ‌లం ఉంటుంది. ఆ కాన్సెప్ట్ నే తీసుకున్నాడు చందూ.
ఈ చిత్రం మే 18న విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు మైత్రి మూవీ మేక‌ర్స్. కానీ ఇక్క‌డే వ‌చ్చింది అస‌లు చిక్కు. నాగార్జున హీరోగా న‌టిస్తున్న ఆఫీస‌ర్ కూడా షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం మే 25న విడుద‌ల కానుంద‌ని అఫీషియ‌ల్ గా పోస్ట‌ర్ కూడా విడుదల చేసారు. దాంతో తండ్రి సినిమానే త‌న‌యుడికి ఇప్పుడు అడ్డుగా మారింది. వారం రోజుల గ్యాప్ లోనే నాగార్జున వ‌స్తే నాగ‌చైత‌న్య సినిమాకు అది న‌ష్ట‌మే. పైగా మే లో భారీ సినిమాలున్నాయి. నా పేరు సూర్యతో పాటు సాక్ష్యం సినిమా కూడా మేలోనే రానుంది. ఇలా వ‌ర‌స సినిమాల మ‌ధ్య కాస్త గ్యాప్ కూడా ఇవ్వ‌కుండా నాగార్జున కూడా వ‌చ్చేస్తే.. నాగ‌చైత‌న్య‌కు బ్యాండ్ త‌ప్ప‌దు. మ‌రి చూడాలిక‌.. ఈ తండ్రీ కొడుకుల స‌మ‌రం ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here