కొత్త సంవత్సరం సందర్భంగా గాయత్రి చిత్రం నుండి విష్ణు మంచు, శ్రియల లుక్ విడుదల!

 
Vishnu Manchu and Shriya Saran’s Look From Gayatri Revealed!
డా. మోహన్ బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం గాయత్రి. ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సరసన మొదటిసారి శ్రియ నటిస్తుండటం మరో విశేషం. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా విష్ణు, శ్రియలు కలిసున్న ఓ పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర బృందం. క్రిస్మస్ కు విడుదల చేసిన గాయత్రి ఫస్ట్ లుక్ పోస్టర్ లో మోహన్ బాబు పవర్ఫుల్ లుక్ కు  విశేష  స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో విష్ణు, శ్రియలు ముచ్చటైన జంటగా కనువిందు చేస్తున్న పోస్టర్ కు కూడా మంచి స్పందన వస్తుంది. ఈ పోస్టర్ ను బట్టి గాయత్రి చిత్రంలో మాస్ యాక్షన్ తోపాటు  మంచి కుటుంబ కథ కూడా ఉంటుందని అర్ధమవుతుంది. మదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు. అనసూయ భరద్వాజ్, నిఖిల విమల్ మరియు బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9 న మన ముందుకు రాబోతున్న   గాయత్రీ చిత్రాన్ని డా.యమ్.మోహన్ బాబు తన ప్రతిష్టాత్మక బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మించగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here