క్రికెట్ తో నీకెందుకు శంక‌రా..?

Superstar Rajinikanth, Great Director Shankar's '2.0' To Hit The Screens Worldwide In April, 2018
నిజంగా సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులు ఉండ‌వేమో కానీ శంక‌ర్ ఏదైనా సినిమా చేస్తుంటే మాత్రం అవి క‌నిపిస్తాయి. అస‌లు అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే అది శంక‌ర్ సినిమా ఎందుకు అవుతుంది..? ఈయ‌న కెరీర్ మొద‌లై 30 ఏళ్ల‌కు చేరువ‌వుతుంది. ఇన్నేళ్ల‌లో ఒక్క‌సారి కూడా ఏ సినిమాను చెప్పిన తేదీకి తీసుకురాలేదు ఈ ద‌ర్శ‌కుడు. దానికి కార‌ణం ఆయ‌న‌కు ప్లానింగ్ లేక కాదు.. ప‌ర్ ఫెక్ష‌నిజం ఎక్కువైపోయి. అనుకున్న‌ది వ‌చ్చేంత‌వ‌ర‌కు అస్స‌లు కాంప్ర‌మైజ్ కాడు ఈ ద‌ర్శ‌కుడు. అందుకే సినిమాలు ఒక్క‌టి కూడా చెప్పిన స‌మ‌యానికి రావు. ఇప్పుడు 2.0 సినిమాది కూడా ఇదే ప‌రిస్థితి. సినిమా సంగ‌తి దేవుడెరుగు.. క‌నీసం టీజ‌ర్ కూడా చెప్పిన టైమ్ కు విడుద‌ల చేయ‌డం లేదు శంక‌ర్. ఆయ‌న ఎలాగూ విడుద‌ల చేయ‌డ‌ని.. ఈ మ‌ధ్యే లీకు వీరులు టీజ‌ర్ ను విడుద‌ల చేసారు. మిగిలిన ద‌ర్శ‌కులైతే టీజ‌ర్ ఎలాగూ లీక్ అయింది క‌దా అని దాన్నే అఫీషియ‌ల్ గా విడుద‌ల చేస్తారు. కానీ శంక‌ర్ మాత్రం అందుకు భిన్నం.
ఇప్ప‌టి వ‌ర‌కు 2.0 టీజ‌ర్ కూడా రాలేదు. ఎప్పుడు వ‌స్తుంది అని అడ‌గడం కూడా మానేసారు ప్రేక్ష‌కులు. అభిమానులు అయితే అస‌లు 2.0 సినిమా గురించే మ‌రిచిపోయారు. ఇలాంటి టైమ్ లో మ‌ళ్లీ ఆశ‌లు రేపుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ సారి ఏకంగా ఐపిఎల్ ను టార్గెట్ చేసాడు శంక‌ర్. ఐపిఎల్ ఫైన‌ల్ మే 27న జ‌ర‌గ‌బోతుంది. అక్క‌డే ఆ స్టేడియంలో 2.0 టీజ‌ర్ విడుద‌ల చేయ‌బోతున్నార‌ని తెలుస్తుంది. గ‌తంలోనూ ఇండియా న్యూజిలాండ్ సిరీస్ అప్పుడు 2.0 యాడ్స్ వ‌చ్చాయి. థ‌ర్డ్ అంపైర్ కు వెళ్లిన ప్ర‌తీసారి స్క్రీన్ పై 2.0 క‌నిపించింది. ఇప్పుడు కూడా ఇదే ప్లాన్ అప్లై చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఐపిఎల్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఆ స్క్రీన్ పై 2.0 టీజ‌ర్ విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు. ఇదే జ‌రిగితే దెబ్బ‌కు ప్ర‌పంచం అంతా టీజ‌ర్ చూస్తుంది. ఇదే శంక‌ర్ ప్లాన్. అంతా బాగానే ఉంది కానీ టీజ‌ర్ వ‌చ్చేవ‌ర‌కు కూడా అనుమానాలే. ఎందుకంటే అక్క‌డున్న‌ది శంక‌ర్ క‌దా.. ముందు డౌట్ పుట్టి ఆ త‌ర్వాత ఈయ‌న పుట్టాడు. చూడాలిక‌.. ఈ క్రికెట్ శంక‌ర్ కు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here