ఇక్కా గంగ పరివాహక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడడం చుసారు అంటే మీకు 5000 ఫైన్ పడడం కాయం. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) హరిద్వార్, రిషీకేష్ మరియు ఉత్తరకాశీ వరకూ క్యారీ బ్యాగ్‌లు, ప్లేట్లు, చాకులు వంటి ప్లాస్టిక్ వస్తువుల అమ్మకాలు, తయారీ, నిల్వలపై నిషేధం విధిస్తున్నట్టు ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ సారథ్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.పర్యావరణవేత్త ఎం.సి.మెహతా వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎన్జీటీ బెంచ్ ఈ తాజా ఆదేశాలిచ్చింది