గోపీచంద్ కు పంతం ఎక్కువే..

Gopichand Pantham
ప్ర‌పంచంలో సున్నా క‌నిపెట్టిన ఆర్య‌భ‌ట్టా త‌ర్వాత‌.. దాన్ని అంత‌బాగా ఇష్ట‌ప‌డేది గోపీచంద్ ఒక్క‌డేనేమో. ఎవ‌రైనా వ‌చ్చి సున్నాకు విలువ లేదంటే గోపీచంద్ కొడ‌తాడేమో వాళ్ల‌ను..? ఎందుకంటే ఆయ‌న కెరీర్ ను మార్చేసింది జీరోనే. సున్నా వ‌చ్చిందంటే ఆయ‌న‌కు విజ‌యం కూడా అలా న‌డిచి వ‌స్తుందంతే. ఇంత‌కీ విష‌యం ఏంటంటే గోపీచంద్ సినిమా టైటిల్స్ లో సున్నా వ‌చ్చిందంటే విజ‌యం కూడా వ‌స్తుంద‌ని ఆయ‌న న‌మ్మ‌కం. కెరీర్ మొద‌ట్లో జ‌యం, నిజం, వ‌ర్షం లాంటి సినిమాల్లో విల‌న్ గా ర‌ప్ఫాడించాడు గోపీచంద్. ఈ మూడు సినిమాల్లోనూ సున్నా టైటిల్ లో ఉంది. ఇక హీరోగా మారిన త‌ర్వాత చేసిన తొలి సినిమా య‌జ్ఞం. ఇందులోనూ సున్నా ఉంది. ఇక ఇప్పుడు పంతం వ‌స్తుంది. ఆయ‌న పంతం ఏంటో చూపిస్తు న్నాడు గోపీచంద్. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. శ్రీ‌నివాస్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రంతో ప‌రిచ‌యం అవుతున్నాడు. మే 18న పంతం విడుద‌ల కానుంది.
ఆ త‌ర్వాత ర‌ణం.. ల‌క్ష్యం.. శౌర్యం.. శంఖం.. లౌక్యం.. సాహ‌సం.. సౌఖ్యం.. లాంటి సినిమాలు చేసాడు గోపీచంద్. ఇందులో శంఖం, సౌఖ్యం త‌ప్ప అన్నీ విజ‌యాలే. దీన్నిబ‌ట్టి సున్నా గోపీచంద్ కు ఎంత‌గా క‌లిసొచ్చిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు మ‌రోసారి త‌న టైటిల్ సున్నాతో వ‌చ్చేసాడు గోపీచంద్. పంతం గోపీచంద్ కు 25వ సినిమా. అంటే రెండు సున్నాలున్నాయ‌న్న‌మాట‌. ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా న‌టిస్తుంది. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో గోపీచంద్ టైమ్ అస్స‌లు బాలేదు. లౌక్యం త‌ర్వాత వ‌చ్చిన సౌక్యం.. జిల్.. గౌత‌మ్ నందా.. ఆక్సీజ‌న్ లాంటి సినిమాలు డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. మ‌రి ఇప్పుడు పంతంతో ఈ హీరో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here