గ‌ల్లా.. ఏంటీ ఈ సిల్లీ క‌థ‌..!


ఈ టైటిల్ మ‌నం పెట్టింది కాదండీ బాబూ..! ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా ప్రేమ‌తో మ‌హేశ్ బాబు బావ.. టిడిపి ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కు రాసిన ప్రేమ‌లేఖ‌. ఈ మ‌ధ్య అంద‌రిపై పంజా విసురుతున్న ప‌వ‌ర్ స్టార్.. ఇప్పుడు త‌న చూపులు గ‌ల్లాపై వేసాడు. ఈయ‌న్ని టార్గెట్ చేస్తూ ట్విట్ట‌ర్ లో లేఖ సంధించాడు. వ‌న్ డే ఇంట‌ర్నేషన‌ల్ మ్యాచ్ లా ఒక్క‌సారి స్పెష‌ల్ స్టేట‌స్ పై లోక్ స‌భ‌లో మాట్లాడి..
మౌనం పాటిస్తున్న గ‌ల్లాగారు మీ మౌనం వెన‌క కార‌ణం ఏంటో తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు తెలుగు స‌ర్.. కొత్త సినిమా.. క‌థ‌.. డైరెక్ష‌న్.. బ్యాట‌రీ డౌన్ లాంటి మాట‌లు మానేసి స్పెష‌ల్ స్టేట‌స్ కోసం పోరాడండి స‌ర్ అంటూ గల్లా ఏంటి నీ సిల్లీ క‌థ అంటూ ఓ ట్వీట్ విడుద‌ల చేసాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.
ప‌వ‌న్ రాసిన లేఖ‌కు వెంట‌నే గ‌ల్లా నుంచి కూడా స‌మాధానం వ‌చ్చేసింది. 100 స్పీచెస్ పార్ల‌మెంట్ లో ఇస్తే సెంచ‌రీ అంటారు. అది మేం పూర్తి చేసాం. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ఎందుకు న‌రేంద్ర‌మోడి గారిని వెన‌కేసుకొస్తున్నారో అర్థం కావ‌డం లేదు. ఇక మా బ్యాట‌రీ అయిపోయింద‌ని మాట్లాడుతున్నారు.. కానీ మేం ఫుల్ ఛార్జింగ్ లోనే ఉన్నాం అంటూ ఘాటు రిప్లై ఒక‌టి ఇచ్చాడు. మొత్తానికి ఈ యుద్ధం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే మారిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here