ఘా.. ఘా.. ప‌డిపోయా నీలిమేఘా..

CHAL MOHAN RANGA SONG
నితిన్ మ‌ళ్లీ రొమాంటిక్ మూడ్ లోకి వ‌చ్చేసాడు. లై సినిమాలో యాక్ష‌న్ సీన్స్ చేసిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు మ‌ళ్లీ ప్రేమే నా ప్రాణం అంటున్నాడు. ఈయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమా చ‌ల్ మోహ‌న్ రంగా. ఈ సినిమాను కృష్ణ‌చైత‌న్య తెర‌కెక్కిస్తున్నాడు. త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్మాత‌లు. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి కూడా ఈ చిత్రానికి ఓ నిర్మాత‌. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని తొలిపాట విడుద‌లైంది. ఇది విన్న త‌ర్వాత నిజంగా ఈ పాట థ‌మ‌నే కొట్టాడా అంటే న‌మ్మ‌డం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక‌ప్పుడు రొటీన్ మ్యూజిక్ తో చిరాకు తెప్పించిన థ‌మ‌న్ ఇప్పుడు చాలా మారిపోయాడు. ఇప్పుడు విడుద‌లైన ఘా ఘా మేఘా పాట కూడా చాలా బాగుంది. ఫ్రెష్ ట్యూన్ తో వినాల‌నిపించేలా ఉంది. తొలిప్రేమ నుంచి త‌న‌ను తాను మార్చుకున్నాడు థ‌మ‌న్. ఇప్పుడు చ‌ల్ మోహ‌న్ రంగ‌లో కూడా ఘా ఘా మేఘా పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. క్యాచీ ట్యూన్ ఇచ్చి కేక పెట్టించాడు థ‌మ‌న్. నితిన్ స‌ర‌స‌న మేఘాఆకాశ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఎప్రిల్ 5న చ‌ల్ మోహ‌న్ రంగ విడుద‌ల కానుంది. లై డిజాస్ట‌ర్ త‌ర్వాత నితిన్.. మేఘా ఆకాశ్ తో వ‌ర‌స‌గా రెండోసారి జోడీ క‌ట్టిన సినిమా ఇది. మ‌రి వీళ్ల జోడీ రెండోసారైనా వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here