చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కోసం ఒక్క‌డున్నాడు..!


ఇండ‌స్ట్రీలో మంచి సినిమాలు తీస్తామంటే ఆ ద‌ర్శ‌కుల‌ను ఎవ‌రూ న‌మ్మ‌రు. మంచితో పాటు క‌మ‌ర్షియ‌ల్ గా కూడా కావాలంటారు. త‌ప్పేం లేదు.. ఇది బిజినెస్ కాబ‌ట్టి పేరుతో పాటు డ‌బ్బులు కూడా రావాలి. అందుకే మంచి సినిమాలు చేసే చంద్ర‌శేఖ‌ర్ యేలేటి లాంటి ద‌ర్శ‌కుల‌కు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ క‌ష్టాలు త‌ప్ప‌వు. ఈయ‌న చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చెడ్డ సినిమా అనిపించుకోలేదు. అన్నీ మంచి సినిమాలే..
కానీ ఆడ‌వంతే. గ‌త సినిమా మ‌నమంతా కూడా చాలా బాగుంద‌నే టాక్ తెచ్చుకుంది. కానీ క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం ఆడ‌లేదు. ఇప్పుడు ఈయ‌న త‌ర్వాతి సినిమా కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడు. సాయిధ‌రంతేజ్ తో సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రిగినా కూడా ఎందుకో కానీ అది ఆగిపోయింది. దాంతో త‌న ఆస్థాన హీరోను ప‌ట్టుకున్నాడు యేలేటి. అత‌డే గోపీచంద్. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ లో ఒక్క‌డున్నాడు.. సాహ‌సం సినిమాలొచ్చాయి.
ఈ రెండూ ప‌ర్లేద‌నిపించాయి.. కానీ క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం వ‌ర్క‌వుట్ కాలేదు. అయితే స‌రే చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు గోపీచంద్. ప్ర‌స్తుతం ఈయ‌న‌కు కూడా విజ‌యాలు లేవు. కొత్త ద‌ర్శ‌కుడు చ‌క్రితో పంతం సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఇది పూర్తైన త‌ర్వాత చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో సినిమా చేయ‌బోతున్నాడు ఈ యాక్ష‌న్ హీరో. మ‌రి చూడాలిక‌.. ఈ కాంబినేష‌న్ లో మూడో సినిమా అయినా క‌మ‌ర్షియ‌ల్ హిట్ వ‌స్తుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here