చిట్టినాయుడు.. ఇప్పుడు ఫుల్ టికెట్..

BHARATH CHILD ARTIST

ఎద‌గ‌డం ఎంత సేపు.. కాలం ఇలా చూస్తుండ‌గానే క‌రిగిపోతుంది. న‌మ్మ‌కం లేదా.. అయితే ఒక్క‌సారి పైన ఆ కుర్రాడి ఫోటో చూడండి. చూడ‌గానే ఈ కుర్రాడెవ‌రో గుర్తొచ్చేసాడా..? పిల్లాడిగా ఉన్న‌పుడు 40 సినిమాలు చేసాడు. పైగా తెలుగులో స్టార్ బుడ్డ క‌మెడియ‌న్ గా కొన్నేళ్ల పాటు ఏలాడు. ఆ ఇప్పుడు గుర్తొచ్చాడా.. అత‌డే మ‌న మాస్ట‌ర్ భ‌ర‌త్. ఇప్పుడు మాస్ట‌ర్ కాదులెండి. హాఫ్ టికెట్ ఫుల్ టికెట్ అయిపోయింది.

చూసిన క‌ళ్లు కూడా న‌మ్మ‌లేని విధంగా పెద్దోడైపోయాడు భ‌ర‌త్. కొన్నాళ్లు సినిమాల‌కు బ్రేక్ ఇచ్చి చ‌దువు పూర్తి చేసుకున్నాడు ఈ కుర్రాడు. ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల వైపు వ‌స్తున్నాడు. తాజాగా అల్లు శిరీష్ హీరోగా న‌టిస్తున్న ఏబిసిడిలో హీరో ఫ్రెండ్ గా ఫుల్ లెంత్ రోల్ చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో అనౌన్స్ చేసాడు శిరీష్. భ‌ర‌త్ ను చూసి ఇప్పుడు మీరు షాక్ అవుతారు.. నా సినిమాలో చేయ‌బోతున్నాడంటూ ట్వీటేసాడు శిరీష్.

ఇక ఈ ఫోటో చూసి ప్రియ‌మ‌ణి కూడా షాక్ అయిపోయింది. ఎందుకంటే ఈ భామ‌తో క‌లిసి ర‌గ‌డ‌లో న‌టించాడు భ‌ర‌త్. అందులో అక్క అక్క అంటూ ర‌చ్చ చేసింది ఈ బ్యాచ్. ఈ గ్యాప్ లోనే ఇలా ఎదిగిపోవ‌డం నిజంగా సూప‌ర్ అంటుంది ప్రియ‌మ‌ణి. త‌న త‌ర‌ఫు నుంచి కూడా భ‌ర‌త్ కు విషెస్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి చూడాలిక‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ అయిన భ‌ర‌త్.. ఇప్పుడు ఏం మాయ చేస్తాడో..?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here