చిత్ర బృందాన్ని అడ్డుకున్న ఎన్టీఆర్ స్వగ్రామం వాసులు!

lakshmi's veeragrandham team stopped in Nimmakuru
బాలకృష్ణ, రామ్ గోపాల్ వర్మలతో బాటు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా మరో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మి’స్ వీరగ్రంధం అనే టైటిల్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆదివారం నాడు ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సమాధి వద్ద ప్రారంభించారు. అయితే అక్కడ చిత్రీకరించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. లక్ష్మి పార్వతి మొదటి భర్త ఎవరు? ఆమె ఎన్టీఆర్ జీవితంలో కి ఎలా ప్రవేశించారు? అనే విషయాంశాలు ప్రధానంగా ఉన్న కథాంశం తో తీస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత దర్శకులు. తాజాగా లక్ష్మి’స్ వీరగ్రంధం షూటింగ్ ఎన్టీఆర్ స్వగ్రామం అయినా నిమ్మకూరు లో మొదలుపెట్టాలని చిత్ర బృందం కృష్ణ జిల్లాకు చేరుకున్నారు. ఆ ఊరి పంచాయతీ పెద్దలను షూటింగ్ కై అనుమతి కోరగా, వారు కూడా నిరాకరించినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా చిత్రాన్ని తీసే ఆలోచన విరమించుకోమని హెచ్చరించారట. చేసేదేమి లేక, ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి వేణు తిరిగారు చిత్ర బృందం.