చిన‌బాబు.. ఆన్ ది వే..!


పేరుకు త‌మిళ్ హీరో కానీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న న‌టుడు కార్తి. ఈయ‌న సినిమాలు తెలుగులో కూడా క‌నీసం 10 కోట్ల మార్కెట్ చేస్తాయి. ఒక‌ప్పుడు వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకొచ్చిన ఈ హీరో.. గ‌తేడాది నుంచి మ‌ళ్లీ తెలుగు మార్కెట్ ను టార్గెట్ చేసాడు. ఖాకీతో తెలుగులో మంచి విజ‌యం అందుకున్నాడు కార్తి. ప్ర‌స్తుతం చిన‌బాబుగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు కార్తి.
జులై 13న విడుద‌ల కానుంది ఈ చిత్రం. తెలుగులో 7 కోట్లకు ఈ చిత్రాన్ని అమ్మేసారు. మిర్యాల ర‌వీందర్ రెడ్డి విడుద‌ల చేస్తున్నాడు తెలుగులో. పాండిరాజ్ ద‌ర్శ‌కుడు. జ‌య జాన‌కి నాయ‌కా లాంటి సినిమాను అందించిన నిర్మాత కావ‌డంతో మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డిపై న‌మ్మ‌కం ఉంది ప్రేక్ష‌కుల‌కు. రైతు క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో యూనివ‌ర్స‌ల్ కంటెంట్ అని ధైర్యంగా క‌నిపిస్తున్నారు సూర్య బ్ర‌ద‌ర్స్.
తెలుగులో దాదాపు 250 థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుంది చిన‌బాబు. కాక‌పోతే సినిమాలో త‌మిళ వాస‌న‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అఖిల్ ఫేమ్ సయేషా సైగ‌ల్ ఈ చిత్రంలో హీరోయిన్. మొత్తానికి చూడాలిక‌.. చినబాబుతో కార్తి ఎలాంటి మాయ చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here