చిరంజీవిని భ‌య‌పెట్టిన ఖైదీ.. 

సాధార‌ణంగా చిరంజీవి సినిమా వ‌స్తుందంటే ఆయ‌న‌తో పోటీప‌డే హీరోలు భ‌య‌ప‌డ‌తారు. కానీ తొలిసారి మెగాస్టార్ త‌న సినిమాను చూసి తానే భ‌య‌ప‌డ్డాడు. ఈ విష‌యం ఎవ‌రో చెప్పింది కాదు.. స్వ‌యంగా మెగాస్టార్ చెప్పిన మాట‌. చిరంజీవిని అంతగా భ‌య‌పెట్టిన సినిమా మ‌రేదో కాదు.. ఖైదీ నెం.150. అవును.. ప‌దేళ్ళ త‌ర్వాత వ‌చ్చినా బాక్సాఫీస్ ను కుమ్మేసిన సినిమా ఖైదీ. అలాంటి సినిమాను చూసి చిరంజీవి భ‌య‌ప‌డ్డాడు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. అప్ప‌టికి చిరంజీవి సినిమా వ‌చ్చి తొమ్మిదేళ్లు దాటింది. అప్ప‌ట్లో ఆయ‌న్ని అభిమానించిన కుర్రాళ్లంతా ఇప్పుడు పెద్దోళ్లై పోయారు. అదే అభిమానం ఇప్పుడు ఉంటుంది అనే గ్యారెంటీ లేదు.. పైగా రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌ర్వాత వ‌స్తున్న తొలి సినిమా. దాంతో ఈయ‌న‌కు చాలా భ‌యం ఉండేది.. నిజంగా అప్ప‌టి అభిమానులు ఇప్పుడు చూస్తారా.. ఖైదీ ఆడుతుందా లేదా అని చాలా రోజులు నిద్ర కూడా పోలేద‌ని చెప్పాడు చిరంజీవి. జీ గోల్డెన్ అవార్డ్స్ కు వ‌చ్చిన మెగాస్టార్.. త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. కానీ ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఈవెంట్ త‌ర్వాత త‌న భ‌యం పోయింద‌ని చెప్పాడు మెగాస్టార్. అప్పుడే సినిమాపై త‌న‌కు న‌మ్మ‌కం వ‌చ్చింద‌ని.. క‌చ్చితంగా ఆడుతుంద‌ని అనుకున్నాన‌న్నాడు చిరంజీవి. ఆ న‌మ్మ‌కంతోనే ఇప్పుడు సైరా సినిమా చేస్తున్నాడు చిరు. ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. వ‌చ్చే ఏడాది మొత్తం షూటింగ్ లోనే ఉన్నా.. 2019 సంక్రాంతికి ఈ చిత్రం సిద్ధ‌మ‌వడం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఖైదీ భ‌యాన్ని సైరా అయినా పోగొడుతుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here