చిరు ఇప్పుడెందుకు టార్గెట్ చేసాడు..?

CHIRANJEEVI YANDAMURI

సాధార‌ణంగా స్టేజ్ పై ఎవ‌ర్నీ టార్గెట్ చేయ‌డు చిరంజీవి. ఒక‌వేళ నిజంగానే కోపం వ‌చ్చినా కూడా కంట్రోల్ చేసుకుంటాడు. కానీ ఎందుకో తెలియ‌దు కానీ ఇప్పుడు మాత్రం మెగాస్టార్ మ‌రిచిపోయిన పాత గాయాన్ని మ‌ళ్లీ త‌లుచుకున్నాడు. కావాల‌నే అంద‌రి ముందు ఆ గుట్టు విప్పాడు. దానికి ఓ కార‌ణం కూడా లేక‌పోలేదు. ఆ మ‌రిచిపోయిన సంఘ‌ట‌న పేరు స్టువర్టుపురం పోలీస్ స్టేష‌న్. చిరు వ‌ర‌స విజ‌యాల్లో ఉన్న‌పుడు..

క్రియేటివ్ క‌మ‌ర్షి య‌ల్స్ బ్యాన‌ర్ లో వ‌ర‌స హిట్లు వ‌స్తున్న‌పుడు వ‌చ్చిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ గా నిలిచింది. చిరంజీవి, కేఎస్ రామారావు కాంబినేష‌న్ లో ఉన్న ఏకైక ప్లాప్ ఇది. ఈ చిత్రాన్ని రైట‌ర్ యండ‌మూరి డైరెక్ట్ చేసాడు. ఈయ‌న‌తో 80ల్లో ఛాలెంజ్.. అభిలాష‌.. మ‌ర‌ణ‌మృదంగం.. రాక్ష‌సుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు ప‌ని చేసాడు చిరు. అప్ప‌టి వ‌ర‌కు అంతా బాగానే ఉన్నా స్టువర్టుపురం పోలీస్ స్టేష‌న్ సినిమాతో కేఎస్ రామారావుతో చిరుకు దూరం కూడా పెరిగిపోయింది. ఆ త‌ర్వాత క‌లిసి ప‌ని చేయ‌లేదు ఈ కాంబినేష‌న్.

ముందు ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా యండ‌మూరిని వ‌ద్ద‌ని కేఎస్ వ‌ద్ద‌న్నా కూడా తానే ప‌ట్టు బ‌ట్టి మ‌రీ ఆయ‌న‌కు అవ‌కాశం ఇప్పించి త‌ప్పు చేసాన‌ని చెప్పాడు మెగాస్టార్. అయితే ఈ విష‌యాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఇప్పుడు లేదు. కానీ ఆ మ‌ధ్య యండ‌మూరి మెగా వార‌సుడు చ‌ర‌ణ్ పై కొన్ని అనుచిత వ్యాఖ్య‌లు చేసాడు. దానికి పర్యావ‌సానంగానే ఇప్పుడు చిరు స్టువ‌ర్టు పురం టాపిక్ తీసార‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. కేవ‌లం యండ‌మూరి త‌ప్పిదం వ‌ల్లే సినిమా ఫ్లాప్ అయింద‌ని అర్థం వ‌చ్చేలా మాట్లాడారు చిరు. మొత్తానికి తేజ్ ఐ ల‌వ్ యూ వేడుక‌లో యండ‌మూరికి గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చాడు మెగాస్టార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here