కనీసం ఒక్కరోజైనా అనుకున్నారా..? అసలు సీన్ లోనే సుమంత్ వచ్చి.. ఫామ్ లో ఉన్న నాగచైతన్యను పడగొడతాడని. రేస్ లో వెనక్కి నెట్టేస్తాడని..? ఇప్పుడు ఇదే జరిగింది. ఓ విషయంలో చైతూను కాదని సుమంత్ ముందడుగు వేసాడు. అది కూడా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో.
ఈ చిత్రంలో తాత పాత్ర కోసం ముందు నాగచైతన్యను తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. మొన్నే మహానటిలో చేసాడు కదా.. అదే కొనసాగిస్తే ఓ పనైపోతుందని భావించాడు క్రిష్. కానీ తర్వాత ఆ నిర్ణయం మార్చుకున్నాడు.
ఏఎన్నార్ గా చైతూ కంటే సుమంత్ అయితే బాగుంటాడని అనుకున్నాడు. అనుకున్నదే తడువు పాత్ర కోసం ఆయన్ని కలిసాడు. ముందు దీనికి నో చెప్పినా.. ఇప్పుడు ఓకే అనేసాడు సుమంత్. దీనికి ఒక్కటే కారణం.. చైతూ కంటే సుమంత్ కే ఎక్కువగా తాత పోలికలు ఉండటం.
దాంతో ఈ విషయంలో నాగచైతన్యను వెనక్కి నెట్టి తాను రేస్ లో ముందుకొచ్చాడు సుమంత్. పైగా బాలయ్య కూడా సుమంత్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇప్పటికే చంద్రబాబునాయుడుగా రానా నటిస్తున్నాడు. ఇప్పుడు సుమంత్ కూడా చేరిపోయాడు. మొత్తానికి చూడాలిక.. ఇంకా సినిమా జరుగుతున్న కొద్దీ ఎంతమంది వచ్చి జాయిన్ అవుతారో..?