చైతూని రిస్క్ లో ప‌డేస్తున్న నాగార్జున‌..


తండ్రి అంటే త‌న‌యుడి కెరీర్ ను గాడిన ప‌డేస్తాడు. కానీ నాగార్జున మాత్రం డిఫెరెంట్ గా ఆలోచిస్తున్నాడు. ఈయ‌న త‌న‌యుడి ఫ్యూచ‌ర్ ను రిస్క్ లో ప‌డేస్తున్నాడు. ఎందుకు అలా అనుకుంటున్నారా..? ఇప్పుడు నాగార్జున ఆఫీస‌ర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది జూన్ 1న విడుద‌ల కానుంది. ఇక దాంతో పాటే శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తోన్న సినిమాలోనూ న‌టిస్తున్నాడు. ఇందులో నాని మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు.
ఈ చిత్రం పూర్తైన త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ తో నాగార్జున సినిమా చేయ‌బోతున్నాడు అనేది ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌. ఇదే నిజమైతే మాత్రం క‌చ్చితంగా రిస్క్ తీసుకున్న‌ట్లే. ఇప్ప‌టికే పూరీ గురువు వ‌ర్మ‌కు ఆఫీస‌ర్ తో ఛాన్స్ ఇచ్చినందుకే అంతా నాగార్జున‌కు ఏమైనా పిచ్చి ప‌ట్టిందా అనుకుంటున్నారు. ఇప్పుడు కానీ పూరీకి అవ‌కాశం ఇస్తే అది ఇంకెలా ఉండ‌బోతుందో..? అదీ కాక ఈ చిత్రంలో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య కూడా న‌టిస్తాడ‌ని తెలుస్తుంది.
గ‌తంలో శివ‌మ‌ణి, సూప‌ర్ ల‌తో నాగ్ కు మంచి సినిమాలే ఇచ్చాడు పూరీ. ఇప్పుడు హ్యాట్రిక్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు. అయితే ఇప్పుడు పూరీ ఉన్న సిచ్యువేష‌న్ కు నాగ్, నాగ‌చైత‌న్య సినిమా అంటే ఆయ‌న‌కు వ‌ర‌మే.. కానీ హీరోల‌కు ఏంట‌నేది చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here