చౌద‌రిగార‌మ్మాయిని కాస్త ప‌ట్టించుకోండ‌య్యా..!


చౌద‌రి గార‌మ్మాయి అంటే ఎవ‌రో తెలుగ‌మ్మాయేమో అనుకునేరు. ఇక్క‌డ చౌద‌రి అంటే సాక్షి చౌద‌రి. అప్పుడెప్పుడో మ‌నోజ్ పోటుగాడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ త‌ర్వాత కూడా ఒక‌ట్రెండు సినిమాలు చేసింది కానీ ఎవ‌రూ పెద్ద‌గా గుర్తించుకోలేదు. అందుకే గుర్తింపు కూడా రాలేదు ఈ భామ‌కు. అందం బోలెడంత ఉన్నా.. ఆవ‌గింజంత అదృష్టం లేక‌.. అలుప‌నేది లేకుండా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది ఈ భామ‌. ఈ మ‌ధ్య కాలంలో పూర్తిగా అందాల ఆర‌బోత‌తోనే ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యే ప‌నితో పాటు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను పడేసే ప‌ని కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. హీరోయిన్ గా స‌క్సెస్ కాలేక‌పోయినా కూడా క‌నీసం ఐటం గాళ్ గా అయినా స‌త్తా చూపించాల‌ని త‌న ట్ర‌య‌ల్స్ మాత్రం ఆప‌డం లేదు ఈ బ్యూటీ. మొన్న‌టికి మొన్న‌ బికినీ ఫోటోషూట్ తో గుండెలు ఆపేసింది. ఇప్పుడు మ‌రో ఫోటోషూట్ తో అందాల తూటాలు పేల్చింది. ఈమె ఫోటోషూట్ చూసి దేవుడా అనుకోకుండా ఉండ‌లేరు. ఎంత చేసినా తెలుగులో అవ‌కాశాలు రాక‌పోయేస‌రికి క‌న్న‌డ‌కు త‌ర‌లిపోతుంది సాక్షి చౌద‌రి. అక్క‌డ ఈ భామ అందాల‌కు బాగానే డిమాండ్ ఉందిప్పుడు. బాలీవుడ్ నుంచి కూడా చిన్న సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అవ‌న్నీ క్యాష్ చేసుకునే ప‌నిలో బిజీగా ఉంది సాక్షి. దానికోస‌మే ఈ అందాల సాక్ష్యం కూడా. మ‌రి ఈమె క‌ష్టాన్ని చూసైనా ఏదో ఓ ద‌ర్శ‌కుడో.. నిర్మాతో క‌రుణించ‌క పోతాడా..? ఏమో చూద్దాం ఇక‌.. ఈ చౌద‌రిగార‌మ్మాయి జాత‌కాన్ని మార్చేసే అత‌గాడు ఎవ‌రో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here