చ‌క్క‌నమ్మ‌.. ఇంత‌గా ఎందుకు చిక్కెన‌మ్మా..? 

చ‌క్క‌న‌మ్మ చిక్కినా అంద‌మే అంటారు క‌దా మ‌న పెద్దోళ్లు. ఇప్పుడు ర‌కుల్ కూడా ఇదే చేసింది. ఉన్న‌ట్లుండి ఈ భామ జీరోసైజ్ లోకి మారిపోయింది. అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఈ భామ బ‌రువు త‌గ్గిపోయింది. మొన్న‌టి వ‌ర‌కు కాస్త బొద్దుగానే క‌నిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం చాలా మారిపోయింది. తాజాగా హిందీ సినిమా అయ్యారీ ప్ర‌మోష‌న్స్ లో క‌నిపించిన ర‌కుల్.. ఊహించ‌ని విధంగా మారిపోయింది. అస‌లు ర‌కుల్ ను చూసి గుర్తు ప‌ట్ట‌డానికి కూడా కాస్త టైమ్ ప‌డుతుందంటే అతిశ‌యోక్తి కాదు. ఉన్న‌ట్లుండి ఇలా జీరోసైజ్ లోకి మారిపోవ‌డానికి కార‌ణ‌మేంటో తెలియ‌దు కానీ ర‌కుల్ మాత్రం చాలా చిక్కిపోయింది.
స్పైడ‌ర్.. జ‌య జాన‌కీ నాయ‌కా లాంటి సినిమాల్లో మ‌నం చూసిన ర‌కుల్ ఈ భామ కాదు.. అంతెందుకు మొన్న వ‌చ్చిన ఖాకీలోనూ ఈ ర‌కుల్ కాదు. ఆమె మ‌రెవ‌రో.. ఇప్పుడు క‌నిపిస్తున్న ముద్దుగుమ్మ పూర్తిగా బాలీవుడ్ స‌రుకు. అందుకే ఇంత‌గా స‌న్న‌బ‌డింది. ఇక‌పై దృష్టి కూడా అక్క‌డే పెడుతుందేమో మ‌రి అందుకే ఇంత‌గా చిక్కిపోయింది ఈ చక్క‌న‌మ్మ‌. అన్న‌ట్లు ఇప్పుడు తెలుగులో ఏ సినిమా చేయ‌ట్లేదు ర‌కుల్. కానీ త‌మిళ్ లో మాత్రం సూర్య హీరోగా సెల్వ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాలో న‌టిస్తుంది. ఇందులో సాయిప‌ల్ల‌వి మ‌రో హీరోయిన్. ఆమెతో పోటీప‌డి ర‌కుల్ క‌నిపించాలంటే ఈ మాత్రం అందాలు త‌ప్ప‌వు. ఎందుకంటే అక్క‌డ ఉన్నది సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌తో మింగేస్తుంది అంద‌ర్నీ. అందుకే ఈ క‌ష్టాలేమో మ‌రి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here