చ‌ర‌ణ్ మ‌ళ్లీ మారుస్తున్నాడా..?

BOYAPATI SEEENU RAM CHARAN STORY CHANGES

రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు మారిపోయాడు. ఈయ‌న పాత చ‌ర‌ణ్ కాదు. ఇప్పుడు మ‌నోడిలో కొత్త ర‌క్తం ప్ర‌వ‌హిస్తుంది. దానికి కార‌ణం ధృవ‌.. రంగ‌స్థ‌లం సినిమాలే. ఈ రెండు సినిమాలు ఈయ‌న‌కు న‌టుడిగా ఇమేజ్ తో పాటు గౌర‌వాన్ని కూడా తీసుకొచ్చాయి. అప్ప‌టి వ‌ర‌కు రొటీన్ సినిమాల రామ్ చ‌ర‌ణ్ అన్న‌వాళ్లే ఇప్పుడు కొత్త‌గా ఉన్నాడు కదా కుర్రాడు అంటున్నారు. ఈ పదం ఇప్పుడు చ‌ర‌ణ్ కు బాగా న‌చ్చేసింది. అందుకే వ‌చ్చిన ఇమేజ్ అంత ఈజీగా వ‌దిలేలా లేడు ఈ హీరో. రంగ‌స్థ‌లం లాంటి సినిమా త‌ర్వాత బోయ‌పాటి శీనుతో సినిమా అన‌గానే మ‌ళ్లీ రొటీన్ అనుకున్నారంతా.

కానీ ఈ చిత్రంలో కూడా కొత్త‌ద‌నం ఉండేలా త‌న‌దైన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు చ‌ర‌ణ్. ఈ చిత్ర క‌థ‌లో ముందు నుంచి చ‌ర‌ణ్ కూడా ఇన్ వాల్వ్ అయే ఉన్నాడు. త‌న‌కు కావాల్సిన‌వి ముందే చెబుతున్నాడు. క‌థ‌ను మార్చేయ‌డం కాదు కానీ మ‌రీ రొటీన్ కాకుండా చూసుకుంటున్నాడు. బోయ‌పాటికి కూడా ఇదే స‌ల‌హా ఇస్తున్నాడు మెగా వార‌సుడు. ఏదైనా చేయండి కానీ రొటీన్ క‌థ చేస్తున్నాడు అనే ముద్ర రాకుండా ఉంటే చాలంటున్నాడు చెర్రీ.

ఇదే ప‌నిమీద ఇప్పుడు బోయ‌పాటి కూడా బిజీగా ఉన్నాడు. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఫారెన్ ట్రిప్ లో ఉన్నాడు. ఈయ‌న వ‌చ్చేలోపు క‌థ‌లో కావాల్సిన‌న్ని మార్పులు చేస్తున్నాడు బోయ‌పాటి శీను. ఇప్ప‌టికే మూడు షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. సినిమా ఇదే ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. అక్టో బ‌ర్ లోపు సినిమా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు బోయ‌పాటి. ఎందుకంటే అదే నెల‌లో రాజ‌మౌళితో జ‌త‌క‌ట్టాలి క‌దా..! మొత్తానికి చూడాలి మ‌రి.. చ‌ర‌ణ్ చెబుతున్న మార్పులు బోయ‌పాటి సినిమాకు ఎంత‌వ‌ర‌కు హెల్ప్ అవుతాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here