ఛానెల్స్ తో గొడ‌వ‌.. ఇండ‌స్ట్రీకి మంచిదేనా..?


న్యూస్ ఛానెల్స్ ను నిషేధించాలంటూ సినిమా ఇండ‌స్ట్రీ నిర్ణ‌యం తీసుకుంద‌నే వార్త‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ ఇది నిజ‌మే అయితే గ‌న‌క నిజంగా ఇది సినిమా వాళ్ల‌కు మంచిదేనా అనే అనుమానాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే న్యూస్ ఛానెల్స్ ను బ్యాన్ చేయ‌డం అనేది మంచి ప‌ద్ద‌తి కాద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు చేసిన త‌ప్పుకు అంద‌ర్నీ శిక్షించ‌డం అనేది మంచిది కాదంటున్నారు విశ్లేష‌కులు.
మొన్న‌టి వ‌ర‌కు టీవీ 9తో పాటు మిగిలిన ఛానెల్స్ ను తెగ తిట్టేసారు మెగా ఫ్యామిలీ. కానీ ఇప్పుడు నా పేరు సూర్య విష‌యానికి వ‌చ్చేస‌రికి మ‌ళ్లీ కాంప్ర‌మైజ్ అయ్యారు. ఇదే ఇప్పుడు అభిమానుల‌కు కోపం తెప్పిస్తుంది. బ‌య‌టి వాళ్ల‌కు ఒక న్యాయం.. మ‌న వాళ్ల‌కు ఒక న్యాయ‌మా అంటూ నిల‌దీస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీవి 9కి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పైగా నాగ‌బాబు, బ‌న్నీ కూడా ఈ ఛానెల్ ను ఏకిపారేసారు.
కానీ మ‌ళ్లీ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుంటే ప్ర‌చారం కావాలి కాబ‌ట్టి మ‌ళ్లీ కాంప్ర‌మైజ్ అయిపోయారు. నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ ఛానెల్ లో రావడంతో ఫ్యాన్స్ ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఇక ఇప్పుడేమో ఛానెల్స్ ను పూర్తిగా నిషేధించాలంటూ నిర్మాతల మండ‌లి నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు ఇండ‌స్ట్రీకి మేలు చేస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here