ఛ‌లో అంటున్న నితిన్.. 

Chal MohanRanga songs
నితిన్ ఇప్పుడు మాంచి జోరు మీదున్నాడు. మ‌నోడికి హిట్లు లేవు కానీ సినిమాల విష‌యంలో మాత్రం చాలా దూకుడు చూపిస్తున్నాడు. ఇప్ప‌టికే నితిన్ చేతుల్లో మూడు సినిమాలున్నాయి. వీటిలో ఇప్పుడు న‌టిస్తున్న ఛ‌ల్ మోహ‌న్ రంగా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఎప్రిల్ 5న ఈ సినిమా రానుంది. కృష్ణ‌చైత‌న్య తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రానికి ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ నిర్మాత‌లు. క‌థ కూడా త్రివిక్ర‌మే అందించాడు. ఇక ఈ చిత్రంతో పాటు ఈ మ‌ధ్యే స‌తీష్ వేగేశ్న‌తో శ్రీ‌నివాస క‌ళ్యాణం మొద‌లుపెట్టాడు. రాశీఖ‌న్నా ఇందులో హీరోయిన్. దిల్ రాజు నిర్మిస్తుండ‌టంతో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఎప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఇక ఈ సినిమాతో పాటు హ‌రీష్ శంక‌ర్ దాగుడు మూతలు సినిమాలోనూ ఓ హీరోగా న‌టించ‌నున్నాడు నితిన్. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజే నిర్మిస్తున్నాడు. ఈ రెండు సినిమాల‌తో పాటు ఛ‌లోతో సూప‌ర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల‌తో నితిన్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. దీనిపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేదు కానీ ఇప్ప‌టికే స్క్రిప్ట్ ప‌నులైతే వేగంగా జ‌రుగుతున్నాయి. నితిన్ తో అ..ఆ లాంటి సూప‌ర్ హిట్ సినిమా నిర్మించిన హారిక హాసిని బ్యాన‌ర్ లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ మూడు సినిమాల‌తో పాటు మ‌రో రెండు క‌థ‌ల‌ను ఫైన‌ల్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. మొత్తానికి లై లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత కూడా నితిన్ వ‌రస సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. మ‌రి ఈ దూకుడు అత‌డి కెరీర్ ను ఎటు వైపుకు తీసుకెళ్ల‌నుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here