ఛ‌లో ఫ్యామిలీ టూర్.. 

హీరోల‌కు ఫ్యామిలీల‌ను చూసుకునే స‌మ‌యం కూడా ఉంటుందా..?  వాళ్ల‌కు షూటింగ్ ల‌తోనే స‌రిపోతుంది.. ఈ రోజుల్లో కుటుంబాన్ని ప‌ట్టించుకునే హీరోలు ఇంకా ఎక్క‌డున్నారు..?  కానీ ఇవ‌న్నీ ఒక‌ప్పుడు.. ఇప్పుడు కాలం మారింది. ఇప్ప‌టి త‌రం హీరోల‌కు ముందు ఫ్యామిలీ.. త‌ర్వాతే సినిమా అంటున్నారు. ఒక‌ప్పుడు కుటుంబాల్ని ప‌ట్టించుకోకుండా నెల‌ల‌ త‌ర‌బ‌డీ షూటింగ్ లో ఉండేవాళ్లు హీరోలు. కానీ ఇప్ప‌టోళ్లు మాత్రం ప‌ర్ ఫెక్ట్ ఫ్యామిలీ ప‌ర్స‌న్స్ గా మారిపోయారు.
ఉదాహ‌ర‌ణకు మ‌హేశ్ బాబ‌నే తీసుకోండి..! ఆయ‌న ఎంత బిజీగా ఉంటాడు. సూప‌ర్ స్టార్ ఉన్న బిజీకి ఫ్యామిలీతో ఒక్క నెలైనా స‌రిగ్గా గ‌డ‌పాలంటే ఎంత క‌ష్టం. కానీ మ‌న మ‌హేశ్ మాత్రం ఛాన్స్ దొరికిన ప్ర‌తీసారి ఫ్యామిలీ టూర్ ఎంజాయ్ చేస్తాడు. ఏ హీరో అయినా ఏడాదికి ఎన్నిసార్లు ఫ్యామిలీతో టూర్లు వెళ్తారు అని అడిగితే ఒక‌టి.. మ‌హా అయితే రెండు అంటారు. కానీ మ‌హేశ్ మాత్రం ఏకంగా అర‌డ‌జ‌న్ కంటే ఎక్కువ సార్లే టూర్ వెళ్తాడు. బోర్ కొడితే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మ‌రీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయ‌డంలో మ‌హేశ్ త‌ర్వాతే ఎవ‌రైనా..! ఇప్పుడు కూడా ఈయ‌న థ‌మ్స్ అప్ యాడ్ కోసం అమెరికా వెళ్లాడు. క‌మ‌ర్షియ‌ల్ టూర్ నే ఫ్యామిలీ ట్రిప్ గా మార్చేసాడు సూప‌ర్ స్టార్.
ఇక బ‌న్నీ కూడా ప‌ర్ ఫెక్ట్ ఫ్యామిలీ ప‌ర్స‌నే. ఇప్పుడు ఈయ‌న నా పేరు సూర్య షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి కుటుంబంతో స‌హా టూర్ వెళ్లాడు. బీచ్ ద‌గ్గ‌ర ఇద్ద‌రు పిల్ల‌లు, భార్య‌తో బ‌న్నీ ఉన్న ఫోటో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఇక ఎన్టీఆర్ ప్ర‌స్తుతం భార్యా పిల్ల‌లో యూర‌ప్ లో ఉన్నాడు. చ‌ర‌ణ్ కూడా మొన్నీమ‌ధ్యే టూర్ వెళ్లొచ్చాడు. వీళ్లు మాత్ర‌మే కాదు.. నాని, ర‌వితేజ‌, అల్ల‌రి న‌రేష్.. ఇలా ప్ర‌తీ హీరో బోర్ కొడితే ఛ‌లో టూర్ అంటున్నారు. మొత్తానికి ఒక‌ప్పుడు ముందు డ‌బ్బు త‌ర్వాత ఫ్యామిలీ అనేవాళ్లు.. ఇప్ప‌టి హీరోలు మాత్రం ముందు కుటుంబం త‌ర్వాతే సినిమాలంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here