ఛ‌ల్ మోహ‌న్ రంగా.. ఎన్టీఆర్ హ్యాపీ..!

అదేంటి.. అయితే గియితే నితిన్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ సంబంధం లేకుండా ఎన్టీఆర్ హ్యాపీ అవుతుండ‌టం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ఈ నేచ‌ర్ లో ఎక్క‌డో జ‌రిగే ఓ మూవెంట్ కు మ‌రెక్కడో జ‌రిగే ఇంకో మూవెంట్ తో లింక్ ఉంటుంది.. అంతా ఇంట‌ర్ లింక్ అంటూ నాన్న‌కు ప్రేమ‌తోలో బ‌ట‌ర్ ఫ్లై ఎఫెక్ట్ గురించి చెప్పాడు సుకుమార్. ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ విష‌యంలో అప్లై అవుతుంది. ఈయ‌న త‌ర్వాతి సినిమా త్రివిక్ర‌మ్ తో చేయ‌బోతున్నాడు. ఇప్పుడు ఈ మాటల మాంత్రికుడు క‌థ అందించిన సినిమా ఛ‌ల్ మోహ‌న్ రంగా విడుద‌లైంది. దీనికి ప‌ర్లేద‌నే టాక్ వ‌చ్చింది. సినిమా ఎలా ఉన్నా ఇందులో త్రివిక్ర‌మ్ పంచ్ లైన్లు మాత్రం అదిరిపోయాయంటున్నారు ప్రేక్ష‌కులు. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ని ఆనందంలో  ముంచేస్తుంది. ఎందుకంటే అజ్ఞాత‌వాసి ఫ్లాప్ త‌ర్వాత ఈయ‌న సినిమాపై భ‌యం వేస్తుంది అభిమానుల‌కు. లోప‌ల ఎన్టీఆర్ ది కూడా ఇదే ప‌రిస్థితి. అయితే మ‌రీ ఒక్క సినిమాతో త్రివిక్ర‌మ్ ను త‌క్కువ అంచ‌నా వేయ‌డం తెలివి త‌క్కువే అవుతుంది.
ఇప్పుడు ఛ‌ల్  మోహ‌న్ రంగాకు పాజిటివ్ వైబ్రేష‌న్స్ రావ‌డంతో ఎన్టీఆర్ హ్యాపీగా ఉన్నాడు. దానికి కార‌ణం త్రివిక్ర‌మ్ పై న‌మ్మ‌కం లేక కాదు.. హిట్ వ‌స్తే ఆయ‌న మైండ్ రీ ఫ్రెష్ అయి త‌న సినిమాకు ఇంకా బాగా వ‌ర్క్ అవుతుంద‌ని..! ఛ‌ల్ మోహ‌న్ రంగాకు మాట‌లు రాసింది కృష్ణ‌చైత‌న్య అయినా ఎందుకో త్రివిక్ర‌మ్ బాగా పూనాడు అనిపిస్తుంది. కామెడీ చాలా బాగా వ‌ర్క‌వుట్ అయింది సినిమాలో. ఇవ‌న్నీ చూస్తుంటే త్రివిక్ర‌మ్ హ్యాండ్ చాలా ఉన్న‌ట్లే అనిపిస్తుంది సినిమాలో. అజ్ఞాత‌వాసిలో ఏదైతే మిస్ అయిందో అదే ఇప్పుడు క‌వ‌ర్ అయింది ఛ‌ల్ మోహ‌న్ రంగాలో. త్రివిక్ర‌మ్ త‌న మార్క్ కామెడీతో సినిమాను నిల‌బెట్టాడు. కథ పాత‌దే అయినా కూడా కామెడీ ఫ్రెష్ గా అనిపించింది. దాంతో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ పండ‌గ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. త‌న త‌ర్వాతి సినిమా త్రివిక్ర‌మ్ తోనే చేయ‌బోతున్నాడు క‌దా..! ఎప్రిల్ 12 నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here