CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
రివ్యూ: ఛల్ మోహన్ రంగా
నటీనటులు: నితిన్, మేఘాఆకాశ్, లిజి, రావు రమేష్, మధు తదితరులు
కథ: త‌్రివిక్రమ్
కథనం, దర్శకుడు: కృష్ణచైతన్య
నిర్మాతలు: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సుధాకర్ రెడ్డి
పవన్.. త్రివిక్రమ్ లాంటి స్టార్స్ నిర్మాతలుగా మారి మరీ నితిన్ తో సినిమా చేయడం అంటే మాటలు కాదు. దాంతో ఛల్ మోహన్ రంగాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. పైగా పదేళ్ల తర్వాత మరో దర్శకుడికి త్రివిక్రమ్ కథ ఇచ్చాడు దాంతో ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం విడుదలైంది. మరి నిజంగానే ఛల్ మోహన్ రంగా అంచనాలు నిలబెట్టుకుందా..?
కథ:
మోహన్ రంగ (నితిన్) మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇంట్లో నాన్న చెప్పింది కాకుండా అన్నీ చేస్తుంటాడు. ఎలాగైనా అమెరికా వెళ్లాలని చిన్నప్పటి నుంచి మోహన్ రంగా కోరిక. కానీ ప్రతీసారి వీసా రిజెక్ట్ అవుతూనే ఉంటుంది. చివరికి ఎలాగోలా వీసా సంపాదిస్తాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లి అక్కడ ఓ పార్టీ చేసుకుని వస్తుంటే మేఘా(మేఘాఆకాశ్) ను చూస్తాడు. ఓ గొడవతో వీళ్ల ప్రయాణం మొదలవుతుంది. ఆ తర్వాత స్నేహంగా మారి.. చివరికి ప్రేమ దగ్గర ఆగుతుంది. కానీ ఒకరికొకరు చెప్పుకోలేక దూరమైపోతారు. తెలియకుండానే ఒకరి నుంచి మరొకరు చాలా దూరం వెళ్లిపోతారు. అసలు మళ్లీ ఎప్పుడు కలిసారు.. అసలు ఎందుకు విడిపోయారు..? ఈ ఇద్దరి జీవితాల్లో వచ్చిన మార్పేంటి అనేది మిగిలిన కథ..
కథనం :
ఓ సినిమా నచ్చాలంటే మనసును కదిలించే ఎమోషన్ అయినా ఉండాలి.. లాజిక్ లు పట్టించుకోలేనంత కామెడీ అయినా ఉండాలి. ఇప్పుడు ఛల్ మోహన్ రంగాలో ఆ రెండోదే ఎక్కువగా ఉంది. తెలిసిన కథే.. తెలిసిన పాత్రలే.. ఎక్కడో చూసినట్లే ఉంటాయి. కానీ చూస్తున్నంత సేపు నవ్విస్తూనే ఉంటాడు ఈ మోహన్ రంగా. త్రివిక్రమ్ దర్శకుడు కాకపోయినా.. ఆయన పంచ్ లు.. మార్క్ డైలాగులు.. మాటల చమక్కులు సినిమా అంతా కనిపించాయి. కృష్ణచైతన్యపై తెలియకుండానే త్రివిక్రమ్ ప్రభావం బాగా పడిపోయింది. సింపుల్ కథనే కావాల్సినంత ఎంటర్ టైనింగ్ గా చెప్పాడు ఈ కుర్ర దర్శకుడు. ప్రేక్షకులకు నవ్వులు పంచితే చాలు.. కథ లేకపోయినా వాళ్లు క్షమించేస్తారు అని ఫిక్సైపోయాడు ఈ దర్శకుడు. ఫస్టాఫ్ లో కథ జోలికి వెళ్లకుండా కేవలం కామెడీతోనే నెట్టుకొచ్చాడు కృష్ణచైతన్య. సెకండాఫ్ లో కథలోకి వెళ్లినా.. అక్కడా కామెడీనే హైలైట్ అయింది. సీరియస్ సిచ్యువేషన్స్ లోనూ కామెడీనే నమ్ముకున్నాడు దర్శకుడు.
దానికి త్రివిక్రమ్ మాటసాయం అదిరిపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ లో రావురమేష్ కామెడీ ట్రాక్ అంతా కడుపులు చెక్కలే. త్రివిక్రమ్ కథ సింపుల్ కానీ.. దానికి ఇచ్చిన ట్రీట్ మెంట్ కొత్తది. రౌడీఫెల్లోతో ఓ వర్గాన్నే మెప్పించిన కృష్ణచైతన్య.. ఈ సారి బాగానే సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా హీరో కారెక్టరైజేషన్ కే టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. కానీ ప్రతీ సీన్ ను ఎంటర్ టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేసాడు. అమెరికా రావడం.. అక్కడ హీరోయిన్ తో ప్రేమ.. ఆ వెంటనే కష్టాలు.. విడిపోవడం.. ఇలా అన్నీ చకచకా జరిగిపోతాయి. సెకండాఫ్ లో కూడా కథ తక్కువ కామెడీ ఎక్కువగా సాగింది. ముఖ్యంగా సీరియస్ సీన్స్ కూడా కామెడీ చేసి పారేసాడు దర్శకుడు. ఓ వైపు ఎమోషనల్ సీన్ రన్ అవుతుంటే.. అండర్ కరెంట్ గా కామెడీ వస్తుంది. కానీ ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించదు. అయితే కథ అనేది లేకపోవడం ఈ చిత్రానికి మైనస్. తెలిసిన కథనే రెండున్నర గంటలు హోల్డ్ చేసాడు. ఇది బి, సి సెంటర్ల వరకు ఎంత వరకు రీచ్ అవుతుందనేది ఛల్ మోహన్ రంగా విజయాన్ని డిసైడ్ చేయనుంది.
నటీనటులు:
నితిన్ బాగా చేసాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టినపిండి. పైగా ఇది ఆయనకు 25వ సినిమా. త్రివిక్రమ్ ను నమ్మి.. కృష్ణచైతన్యతో కలిసి అడుగేసాడు నితిన్. మైల్ స్టోన్ మూవీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నితిన్. ఇక మేఘాఆకాశ్ నటిగా ఇంకా ఎదగాలేమో కానీ అందంగా ఉంది. స్క్రీన్ పై మాయ చేసింది. హీరో ఫ్రెండ్ గా మధు బాగానే నవ్వించాడు. ఫస్టాఫ్ లో హీరో ఆఫీస్ మేనేజర్ గా ప్రభాస్ శీను బాగా చేసాడు. రావు రమేష్ కారెక్టర్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంది. ఇది ఓ రకంగా అ..ఆ సినిమాకు కంటిన్యూగా అనిపించింది. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
థమన్ మరోసారి ఆకట్టుకున్నాడు. తొలిప్రేమ నుంచి ఈయనలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు కూడా రీ ఫ్రెషింగ్ ఆర్ఆర్ ఇచ్చాడు. అయితే పాటల్లో మాత్రం ఎక్కడో విన్న ఫీలింగ్ వస్తుంది. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ పర్లేదు. సెకండాఫ్ లో కొన్ని సీన్లు బోర్ అనిపిస్తాయి. ఇక నటరాజ సుబ్రమణ్యన్ సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది. అమెరికా అందాలతో పాటు ఊటీ అందాలను కూడా బాగా చూపించాడు. త్రివిక్రమ్ కథ పాతదే అయినా దాన్ని ఎంటర్ టైనింగ్ గా రాసుకోవడం కృష్ణచైతన్య బాగానే సక్సెస్ అయ్యాడు. ఈ కథను ఇంతకంటే బాగా చెప్పడం కాస్తకష్టమే. కానీ ట్రై చేసాడు ఈ దర్శకుడు.
చివరగా:
ఛల్ మోహన్ రంగా.. ఎంటర్ టైనింగ్ ఛల్ ఛల్ ఛల్..