జవాన్ ముచ్చట్లు చెప్పిన మెహ్రీన్ పిర్జాదా

Mehreen pirzada interview about jawaan
మహానుభావుడు, రాజా ది గ్రేట్ వంటి హిట్ లతో దూసుకుపోతున్న మెహ్రీన్ పిర్జాదా జవాన్ చిత్రం తో మనముందుకు రాబోతుంది. బి.వి.ఎస్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో జత కట్టింది మెహ్రీన్. చిత్రం లో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ, మెహ్రీన్ ఈ చిత్రంలో భార్గవి అనే పెయింటర్ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి తరహా ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలు చేసిన మెహ్రీన్ ఈ చిత్రంలో గ్లామరస్ గా కనిపించే బోతుంది.
ఇప్పటికే విడుదలైన ‘బుగ్గనుచునా’ అనే పాటలో సాయి ధరమ్ తో హాట్ హాట్ గా రొమాంటిక్ సన్నివేశాల్లో పాల్గొన్న మెహ్రీన్ తనని తాను ఇంతవరకు అంత గ్లామరస్ గా చూసుకోలేదన్నారు. నటి గా రకరకాల పాత్రలు చెయ్యక తప్పదని ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని అన్నారు. నిజ జీవితంలో తను చాలా సాదా సీదా అమ్మాయినని చెప్పింది మెహ్రీన్. సాయి ధరమ్ తేజ్ చాలా కూల్, హ్యాపీ మరియు ఫ్రెండ్లీ పర్సన్ అని చెప్పింది మెహ్రీన్. తెలుగు చిత్ర సీమ తనకు ప్రత్యేకంమని, ముంబై కంటే ఎక్కువ హైదరాబాద్ లో నే ఉంటున్నానని, బాహుబలి లాంటి చిత్రం ఇక్కడి నుండి రావడం తనకు గర్వకారణం అని, హీరోయిన్లు బాలీవుడ్ కోసం ఎందుకు ఎగబడతారో తెలియదని చెప్పుకొచ్చారు ఈ పంజాబీ భామ. తర్వాత గోపీచంద్ చిత్రం చేయనున్నట్లు చెప్పారు మెహ్రీన్. చక్రి దర్శకత్వం వహించనున్న ఆ చిత్రాన్ని రాధామోహన్ నిర్మాత. జవాన్ డిసెంబర్ 1 న విడుదల కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here