జిగేల్ రాణి అదిరిపోయిందిగా.. 


జిల్ జిల్ జిగేల్ రాణి అంటూ పూజాహెగ్డే వ‌చ్చేసింది. అదిరిపోయే చిందుల‌తో పిచ్చెక్కించింది. రామ్ చ‌ర‌ణ్ మాస్ డాన్సుల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసాడు. జిల్ జిల్ అంటూ జిగేల్ రాణి చుట్టూ ఓ రేంజ్ లో ర‌ప్ఫాడించారు రంగ‌స్థ‌లం ఊరోళ్లు. తాజాగా రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే కానుక‌గా విడుద‌లైన పాట‌ను చూస్తుంటే అబ్బో అనుకోక త‌ప్ప‌దు. ఐటం సాంగ్ అన‌గానే ముందుగా గుర్తొచ్చేది సుకుమార్.. ఆయన టేకింగ్. ఇక్క‌డ కూడా ర‌చ్చ రంబోలా చేసేసాడు సుకుమార్. ఎలాగైతే ఉంటుంద‌ని ఊహించుకున్నారో.. అది మించిపోయేలాగే ఉంది పాట‌. ఊర‌మాస్ లుంగీడాన్స్ తో చ‌ర‌ణ్ చేసిన ర‌చ్చ‌కు తోడు.. పూజాహెగ్డే అందాల ఆర‌బోతతో జిగేల్ రాణి నిజంగానే జిగేల్ అనిపించింది. ఇక జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ పాట‌కు మ‌రో హైలైట్. 30 సెకన్ల పాట‌లోనే ర‌చ్చ ఈ రేంజ్ లో ఉంటే.. రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత థియేట‌ర్స్ లో ఆ ర‌చ్చ ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే. లుంగీ డాన్సుల‌తో థియేట‌ర్స్ అన్నీ మారుమోగిపోతాయేమో..? మరి చూడాలిక‌.. రంగ‌స్థ‌లం జిగేల్ రాణి కుర్రాళ్ల‌ను ఏం చేయ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here