జీవితకు స‌మాధానం చెప్పండి మ‌రి..?


నెల రోజులుగా అన్ని చానెల్స్ చుట్టేస్తూ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది శ్రీ‌రెడ్డి. ఈమెపై మొన్న‌టి వ‌ర‌కు కూడా ఏదో చిన్న సాఫ్ట్ కార్న‌ర్ ఉండేది కొంత‌మందిలో. అరే ఒక్క‌త్తే ఫైట్ చేస్తుంది అని. కానీ ఎప్పుడైతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు అన్నం పెట్టిన ఇండ‌స్ట్రీని కూడా ఇష్ట‌మొచ్చి న‌ట్లు మాట్లాడేసిందో అప్పుడే శ్రీ‌రెడ్డి చేస్తోన్న ప‌నుల‌కు అంద‌ర్లోనూ అస‌హ్యం మొద‌లైంది. ఎవ‌రినీ లెక్క చేయ‌కుండా నోటికొచ్చింది మాట్లాడుతూ ఫేమ‌స్ అవ్వాల‌ని చూసింది శ్రీ‌రెడ్డి.
ఇప్పుడు ఈమెకు స‌పోర్ట్ చేయాల‌నుకున్న వాళ్ల‌కు కూడా చివాట్లు త‌ప్ప‌డం లేదు. జీవిత మీడియా ముందుకు వ‌చ్చి కొన్ని ప్ర‌శ్న‌లు అడిగింది. ఒక్కొక్క‌రికి 20-30 ఏళ్లు వ‌చ్చాయి క‌దా మ‌రి మీకు తెలియ‌కుండానే వెళ్లి ప‌డుకున్నారా అంటూ ఒక‌టే ప్ర‌శ్న అంద‌ర్నీ అడిగేసింది. మ‌రి దీనికి ఏ స‌మాధానం చెప్తారు..?
మాకు అన్యాయం జ‌రిగిపోయింది బాబోయ్ అంటూ రోడ్ల మీద బ‌ట్ట‌లిప్పుకునే తిరిగే వాళ్లు దీనికి ఏ స‌మాధానం చెప్తారు..? ఎంజాయ్ చేసిన‌పుడు చేసి.. డ‌బ్బులు బాగానే సంపాదించుకుని ఇప్పుడు ఏమీ తెలియ‌న‌ట్లు మోస‌పోయాం అంటే న‌మ్మ‌డానికి ఎవ‌రూ లేరంటూ ఘాటుగానే రివ‌ర్స్ అయింది జీవిత‌.
ప‌దేళ్లుగా మోస‌పోతూనే ఉన్నాం అని తెలుసుకోలేక‌పోడానికి చిన్న‌పిల్లేం కాదుగా ప్ర‌శ్నించింది జీవిత‌. మ‌రి ఈమె ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పమ‌నండి స‌ద‌రు శ్రీ‌రెడ్డి గారిని.. ఆమెతో పాటే పోరాటం చేస్తోన్న వాళ్ల‌ను. ఊరికే ఓ రెండు మూడు చెత్త ఛానెల్స్ స‌పోర్ట్ ఉంది క‌దా అని సాయంత్రం కాగానే తాగుబోతు వైన్ షాక్ వైపు ప‌రిగెత్తిన‌ట్లు..
వీళ్లెళ్ళి ఆ స్టూడియోలో కూర్చోవ‌డం.. పంచాయితీలు పెట్ట‌డం ఏంటో..? ద‌మ్ముంటే ఇప్పుడు జీవిత అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పి అప్పుడు ఉద్యమం చేయాలంటూ శ్రీ‌రెడ్డికి స‌వాల్ విసురుతున్నారంతా. మ‌రి ఈ శ్రీ‌రెడ్డి గారు దీనికి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here