తేజ్ ప్రేమ‌క‌థకు ముహూర్తం కుదిరింది..


రొమాన్స్ చేయ‌డంలో ఆరితేరిపోతున్నాడు సాయిధ‌రంతేజ్. ప్ర‌తీ సినిమాలోనూ హీరోయిన్ల‌తో రెచ్చిపోతున్నాడు. మొన్న‌టికి మొన్న జ‌వాన్ లో మెహ్రీన్ తో.. ఈ మ‌ధ్యే ఇంటిలిజెంట్ లో లావ‌ణ్య త్రిపాఠితో త‌న‌దైన రొమాన్స్ చేసాడు సాయి. ఇక ఇప్పుడు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తోనూ ఇదే సీన్ రిపీట్ చేస్తున్నాడు.
ఈ ఇద్ద‌రు క‌లిసి ఇప్పుడు తేజ్ ఐ ల‌వ్ యూ చిత్రంలో న‌టిస్తున్నారు. క‌రుణాక‌ర‌ణ్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటే సినిమా ప‌క్కా రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ అని అర్థ‌మైపోయింది. తాజాగా ఈ చిత్ర విడుద‌ల తేదీ అనౌన్స్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. జూన్ 29న విడుద‌ల కానుంది తేజ్ ఐ ల‌వ్ యు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ తో పాటు కొన్ని స్టిల్స్ కూడా వింటేజ్ క‌రుణాక‌ర‌ణ్ గుర్తొస్తున్నాడు.
ఇందులో హీరోయిన్ మెమోరి లాస్ పేషెంట్ గా క‌నిపిస్తుంద‌ని తెలుస్తుంది. ఎదుటే ఉన్న ప్రేమికున్ని గుర్తించ‌లేని పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌నిపిస్తుంది. అచ్చంగా ఇలాంటి పాత్రే ఉల్లాసంగా ఉత్సాహంగాలో హీరోయిన్ పాత్ర‌కు డిజైన్ చేసాడు క‌రుణాక‌ర‌ణ్. అయితే అక్క‌డ అది నాట‌కం.. కానీ ఇప్పుడు ఇక్క‌డ మాత్రం నిజం.
అంతా బాగానే ఉంది కానీ సాయి కోరుకుంటున్న విజ‌యం ఈ చిత్రంతో అయినా వ‌స్తుందా రాదా అనేది ఇప్పుడు ఆస‌క్తి క‌లిగిస్తుంది. ఎందుకంటే ఓ వైపు సాయి ఫ్లాపుల్లోనే ఉన్నాడు.. మ‌రోవైపు నిర్మాత కేఎస్ రామారావుకు హిట్లు లేవు.. అనుప‌మ జాత‌కం కూడా బాగాలేదు.. ఇక క‌రుణాక‌ర‌ణ్ సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలా అంతా ఫ్లాప్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న సినిమా ఇది. చిన్న‌పుడు చ‌దువుకున్న‌ట్లు మైన‌స్ మైన‌స్ ప్ల‌స్ అవుతుందేమో చూద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here