జై సింహా చిత్రీకరణ పూర్తి – జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Jai Simha Shooting Finished - GrandRelease On Jan 12,2018
నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “జై సింహా” నేటితో దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది. బాలయ్య, నాయనతారలపై  ఒక పాట, బాలయ్య-నటాషా జోషిలపై మరో గీతం దుబాయ్ లో కంప్లీట్ అయ్యింది. ఈ రెండు పాటలతో షూటింగ్ పుర్తయింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. “దుబాయ్ లో 30 మంది యూరోపియన్ డ్యాన్సర్స్ తో బాలయ్య-నటాషా ల మధ్య యుగళ గీతం జానీ మాస్టర్ నేతృత్వంలో, 20 మంది యూరోపియన్ డ్యాన్సర్స్ తో బాలయ్య-నయనతారలపై మరో లవ్లీ సాంగ్ ను బృంద మాస్టర్ నేతృత్వంలో చాలా లావిష్ గా చిత్రీకరించాం. డిసెంబర్ నెలాఖరుకు చిరంతన్ భట్ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలను భారీ వేడుక నిర్వహించి విడుదల చేయనున్నాం. జనవరి 12న బాలయ్య అభిమానులకు సంక్రాంతి కానుకగా “జై సింహా” చిత్రాన్ని విడుదల చేయనున్నాం. బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, కె.ఎస్.రవికుమార్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటుంది” అన్నారు.
నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, మురళి మోహన్, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, శివపార్వతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, యాక్షన్: అంబరివ్-రామ్ లక్ష్మణ్-వెంకట్, కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహనిర్మాత: సి.వి.రావు, కార్యనిర్వాహక నిర్మాతలు: వరుణ్-తేజ, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here