జ్యోతిక‌.. ఆ బూతులేంట‌మ్మా..? 

హీరోలు బూతులు మాట్లాడితే మ‌న స‌మాజం ఒప్పుకుంటుందేమో కానీ హీరోయిన్లు మాట్లాడితే మాత్రం త‌ట్టుకోలేదు.. ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇది ప్ర‌శ్నించ‌డానికే జ్యోతిక ముందుకొచ్చింది. ఈమె అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడు ఎవ‌రి ద‌గ్గ‌ర స‌మాధానాల్లేవు. హీరోలు మాట్లాడితే లేవ‌ని నోరు.. హీరోయిన్లు బూతులు మాట్లాడుతుంటే లేస్తుంది ఏ.. అంటూ బాల‌య్య స్టైల్ లో వార్నింగ్ ఇస్తుంది జ్యోతిక‌. ఈమె ప్ర‌స్తుతం న‌చియార్ సినిమాలో న‌టిస్తుంది. బాల ద‌ర్శ‌కుడు. ఈయ‌న ద‌ర్శ‌కుడు అంటేనే సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. అదే జ‌రుగుతుందిప్పుడు. విడుద‌ల‌కు ముందే ఈ చిత్రంపై కావాల్సినంత ర‌చ్చ జ‌రుగుతుంది. టీజ‌ర్ లోనే లం… కొడ‌కా అనే బూతు కూడా మాట్లాడింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ట్రైల‌ర్ లో విశ్వ‌రూపం చూపించింది. బాల క‌దా ఆ మాత్రం రా మెటీరియ‌ల్ ఉండ‌క త‌ప్ప‌దు. ఇందులో జ్యోతికను చూసి షాక‌వుతున్నారంతా. రౌడీ పోలీస్ ఆఫీస‌ర్ గా ర‌చ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక మ‌ణిర‌త్నం త‌ర్వాతి సినిమాలోను జ్యోతిక హీరోయిన్ గా ఎంపికైంది. ఇదే సినిమాలో విజ‌య్ సేతుప‌తి.. అర‌వింద్ స్వామి.. ఐశ్వ‌ర్యా రాజేష్.. ఫ‌హాద్ ఫాజిల్ కూడా న‌టిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. మొత్తానికి ఇన్నాళ్లూ పిల్ల‌లు చిన్న‌గా ఉన్నార‌ని లైట్ తీసుకున్న జ్యోతిక‌.. ఇప్పుడు ఆ లోటు కూడా భ‌ర్తీ చేసేలా క‌నిపిస్తోంది. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ ను సూర్య అర్థాంగి బాగా సీరియ‌స్ గా తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here