జ‌న‌వ‌రి 1న మెగా బొనాంజా..

 

Stylish star to work with a debutant?
న్యూ ఇయ‌ర్ వ‌స్తుందంటే చాలు.. క‌చ్చితంగా అభిమానులు త‌మ హీరో నుంచి ఏదో ఓ బ‌హుమానం కోరుకుంటారు. ఇప్పుడు మెగా హీరోలు కూడా ఇదే చేయ‌బోతున్నారు. వాళ్లు న‌టిస్తున్న కొత్త సినిమాల ముచ్చ‌ట్లను ఈ జ‌న‌వ‌రి 1కి పంచుకోబోతున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న అజ్ఞాత‌వాసి ఆడియో విడుద‌లైంది. ఇక డిసెంబ‌ర్ 31 రాత్రి అజ్ఞాత‌వాసిలో ఆయ‌న పాడిన కొడ‌కా కోటేశ్వ‌ర‌రావ్ పాట‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు చిత్ర‌యూనిట్. ఇక గ‌తేడాది డిసెంబ‌ర్ 31 రాత్రి ఖైదీ నెం.150లోని ర‌త్తాలు ర‌త్తాలు పాట విడుద‌లైంది. ఇప్పుడు ఆ బాధ్య‌త త‌మ్ముడు తీసుకున్నాడు. ఇదే రోజు బ‌న్నీ న‌టిస్తున్న నా పేరు సూర్య ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల కానుంది. ఈ రెండు సినిమాల‌పై అంచ‌నాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాపై 150 కోట్ల వ్యాపారం జ‌రుగుతుంది. మ‌రి ప‌వ‌న్ మ‌రోసారి గ‌ళం విప్పిన ఆ పాట ఎలా ఉండ‌బోతుందో.. బ‌న్నీ నా పేరు సూర్య ఇంపాక్ట్ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here