జ‌న‌వ‌రి 26.. ర‌చ్చో ర‌చ్చ‌స్య ర‌చ్చ‌భ్యః.. 

Anushka is showing her star stamina!
డిజేలో బ‌న్నీ చెప్పిన‌ట్లుగానే ఇప్పుడు జ‌న‌వ‌రి 26 త‌యారైంది. సంక్రాంతి త‌ర్వాత వ‌చ్చే భారీ సీజ‌న్ ఇదే. పండ‌క్కి రాలేని సినిమాలు.. వాయిదా ప‌డిన సినిమాల‌న్నీ ఇప్పుడు వ‌స్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. విశాల్.. అనుష్క‌.. లాంటి వాళ్ళంతా పండ‌క్కి రావాల‌ని ప్ర‌య‌త్నం చేసి విఫ‌ల‌మై జ‌న‌వ‌రి 26న వ‌స్తున్నారు. ఈ తేదీ కోసం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో యుద్ధాలే జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రి 26న అర‌డ‌జ‌న్ సినిమాలు వ‌స్తున్నాయి. మూన్నెళ్ల ముందు నుంచే కొంద‌రు ఖ‌ర్చీఫ్ వేస్తే.. లేట్ ఎంట్రీతో ముందు వాళ్ల‌ను టెన్ష‌న్ పెడుతున్నారు ఇంకొంద‌రు. ఇప్పుడు జ‌న‌వ‌రి 26 కోసం ఇలాంటి ర‌చ్చే జ‌రుగుతుంది ఇండ‌స్ట్రీలో. ఆరోజు అనుష్క భాగ‌మ‌తి విడుద‌ల కానుంది. ముందు సంక్రాంతికి రావాల‌ని చూసినా కూడా అనుకోని కార‌ణాల‌తో ఆ చిత్రం 13 రోజులు ఆల‌స్యంగా వ‌స్తుంది.
ఇక అదే రోజు విశాల్ అభిమ‌న్యుడు కూడా విడుద‌ల కానుంది. ఈ చిత్రంపై తెలుగులో పెద్ద‌గా అంచ‌నాలు లేవు కానీ జిఎస్టీ ప్ర‌ధాన క‌థ‌గా.. దానికి తోడు సైబ‌ర్ క్రైమ్ తో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో అభిమ‌న్యున్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డానికి లేదు. ఇక ఇదే రోజు సందీప్ కిష‌న్ హీరోగా మ‌హేశ్ సోద‌రి మంజుల తెర‌కెక్కించిన మ‌న‌సుకు న‌చ్చింది సినిమా కూడా వ‌స్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటే ఇది పూర్తిగా క్లాస్ సినిమా అనే సంగ‌తి అర్థ‌మైపోతుంది. తొలిసారి మంజుల మెగాఫోన్ ప‌ట్టిన సినిమా ఇది. ఇక ఇదే రోజు విష్ణు న‌టించిన ఆచారి అమెరికా యాత్ర.. అక్ష‌య్ కుమార్ ప్యాడ్ మ్యాన్.. దీపిక ప‌దుకొనే ప‌ద్మావ‌త్ కూడా జ‌న‌వ‌రి 25, 26 తేదీల్లోనే వ‌స్తున్నాయి. అంటే ఒక్క రోజు గ్యాప్ లో టాలీవుడ్.. బాలీవుడ్ ఊగిపోనుంద‌న్న‌మాట‌. మ‌రి ఈ పోటీలో ఏది విజ‌యం సాధిస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here