జ‌న‌సేన‌.. ప్ర‌తీకార క‌థా చిత్రం..

అవును మ‌రి.. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. సినిమాల్లో మ‌నం చూస్తూనే ఉంటాం క‌దా.. అన్న‌ను మోసం చేసిన వాళ్ల‌ను త‌మ్ముడు ప‌గ బ‌ట్టి చంపేయ‌డం. ఇప్పుడు కూడా రియ‌ల్ లైఫ్ లో ఇదే చేస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. త‌న అన్న‌య్య చిరంజీవిని అప్పుడు పిఆర్పీ టైమ్ లో ఎవ‌రెవ‌రు అయితే మోసం చేసారో అంద‌ర్నీ ఇప్పుడు దెబ్బ కొడ‌దాం అంటున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్పుడు ఆయ‌న ఇస్తోన్న స్పీచ్ లు వింటుంటే అన్న‌య్య‌పై ప‌వ‌న్ కు ఎంత ప్రేమ ఉందో చెప్ప‌క‌నే చెబుతుంది. తాను చిరంజీవి అంత మంచి వాన్ని కాద‌ని చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అంటే ఈ లెక్క‌న ప‌వ‌న్ దృష్టిలో చిరు దేవుడు అన్న‌మాట‌.
మెగా బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య చీల‌కలు వ‌చ్చాయ‌ని ఈ మ‌ధ్య చాలా క‌మెంట్స్ వినిపించాయి. కానీ అవ‌న్నీ నిజం కాద‌ని.. మెగాస్టార్ తో ప‌వ‌ర్ స్టార్ ఇంకా అదే క్లోజ్ నెస్ తో ఉన్నాడ‌ని స‌న్నిహిత వ‌ర్గాలు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాయి. కానీ కొంద‌రు న‌మ్మ‌డం లేదు. అయితే ఇప్పుడు వాళ్ల‌కు కూడా ఫుల్ పిక్చ‌ర్ క్లారిటీ వ‌చ్చేసింది. జన‌సేనాని జ‌నంలోకి వెళ్లి చెబుతున్న మాట‌లు వింటుంటే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిందే అన్న‌య్య‌ను మోసం చేసిన వాళ్ల‌పై ప‌గ తీర్చుకోడానికా అన్న‌ట్లుంది వ్య‌వ‌హారం. రాజ‌కీయాల్లో చిరు చేసిన కొన్ని ప‌నులు మాత్రం ప‌వ‌న్ ను డిస్ట‌ర్బ్ చేసిన మాట వాస్త‌వం. అది కాకుండా ప‌ర్స‌న‌ల్ గా మాత్రం చిరు అంటే ప‌వ‌న్ కు ఎన‌లేని గౌర‌వం. ఇప్ప‌టికీ అన్న‌య్య‌తో పాటు అంద‌ర్నీ అదే గౌర‌వం.. ప్రేమ‌తో చూసుకుంటాడు ప‌వ‌ర్ స్టార్.
చిరంజీవి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇద్ద‌రూ కాస్త దూరంగా ఉంటున్నారు. అది కూడా రాజ‌కీయాల ప‌రంగానే.. క‌టుంబ ప‌రంగా ఇప్పటికీ ఎప్ప‌టికీ మెగా బ్ర‌ద‌ర్స్ ఒకే దారిలో న‌డుస్తుంటారు. ఈ రోజుకు కూడా అన్న‌య్య చెప్పిందే ప‌వ‌న్ కు వేదం. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీసారి త‌న‌కు అన్న‌య్య అంటే ఎంత ఇష్ట‌మో చెబుతూనే ఉన్నాడు ప‌వ‌ర్ స్టార్. ఇక ఇప్పుడు మ‌రోసారి త‌న మాట‌ల తూటాలు పేలుస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. జ‌న‌సేన పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా అప్పుడు అన్న‌య్య‌కు వెన్నుపోటు పొడిచిన వాళ్ల‌ను గుర్తు చేసుకుంటున్నాడు. వాళ్ల అంతం చూసే వ‌ర‌కు నిద్ర పోను అంటూ శ‌ప‌థాలు చేస్తున్నాడు ఈ త‌మ్ముడు. మొత్తానికి అన్న‌య్య అంటే ఇన్నాళ్లూ ఎంత ప్రేముందో అనుకున్నాం కానీ ఇప్పుడు ప‌వ‌న్ ఆవేశం చూస్తుంటే చిరంజీవిని అక్క‌డ పెట్టి చూసుకుంటున్న‌ట్లు అర్థ‌మైపోతుంది. ఎంతైనా సొంత రక్తం క‌దా ఎక్క‌డికి పోతుంది ఆ బంధం..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here