రెండు కొప్పులు ఒకచోట ఉండవు.. ఒకే అరలో రెండు కత్తులు ఇమడవు.. అంటూ కొన్ని సామెతలు చెబుతుంటారు. వీటన్నింటికీ అర్థం ఒక్కటే. ఒకేచోట ఇద్దరు అమ్మాయిలు ఉండలేరు.. అది కూడా ఈ పోటీ ప్రపంచంలో అనుకుంటారు. కానీ అనసూయ.. రష్మిని చూస్తుంటే మాత్రం ఇది అనిపించదు.
ఇద్దరూ ఒకరి కోసం మరొకరు అన్నంత స్నేహంగా ఉంటారు. ఇద్దరూ హాట్ యాంకర్లే. పైగా ఇద్దరూ ఒకే షో నుంచి పాపులర్ అయిన వాళ్లే. అంతకుముందు ఇద్దరికీ ఇమేజ్ లేదు. జబర్దస్థ్ అనే ఒక్క ప్రోగ్రామ్ తో ఇటు అనసూయ.. అటు రష్మి జాతకాలు మారిపోయాయి. ఇద్దరూ నమ్ముకున్నది అందాల ప్రదర్శననే. బుల్లితెరపై వీళ్ల అందాల తాకిడికి స్క్రీన్లు వేడెక్కిపోయాయి. ఈ మధ్యే ఇద్దరూ సినిమాల్లోనూ రాణిస్తున్నారు. హీరోయిన్లుగా కాకపోయినా కూడా హాట్ కారెక్టర్స్ తో దూసుకెళ్తున్నారు.
అనసూయ, రష్మి మధ్య ఏదో కోల్డ్ వార్ నడుస్తుందని చాలా కాలంగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు నో అనే సమాధానం చాలాసార్లే చెప్పారు. కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని వదిలేసుకున్నారు. తమ చేతలతో వాళ్ల సాన్నిహిత్యం చూపిస్తున్నారు అనసూయ, రష్మి. ఇద్దరూ జబర్దస్థ్ గా పోజులిస్తున్నారు. బయటికి ఎక్కడికి వెళ్లినా కలిసే పార్టీలు చేసుకుంటున్నారు. పైగా కలిసి ఫోటోలకు పోజులిస్తూ..
తామెంత క్లోజ్ గా ఉన్నామో చూడండంటున్నారు. ఇప్పుడు కూడా రష్మి బర్త్ డే పార్టీలో అనసూయ ఆడిపాడింది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నా.. అవకాశం రాక ఇద్దరూ వెనకే ఉండిపోయారు. మొత్తానికి జబర్దస్థ్ కుటుంబం నుంచే వచ్చారు కాబట్టి తోబుట్టువుల్లాగే ఉంటున్నారు ఈ యాంకర్లు. మరి ఈ మస్త్ దోస్తానా చూసిన తర్వాత కూడా అనసూయ, రష్మిపై రూమర్లు వస్తే ఇంక ఎవరేం చేయలేరు..!