ఝాన్వీక‌పూర్ బ‌ర్త్ డే.. హైలీ ఎమోష‌న‌ల్.. 


అమ్మ లేకుండానే ఈ రోజు నుంచి ఉండాలి.. అమ్మ లేకుండానే తినాలి.. అమ్మ లేకుండానే నిద్ర‌పోవాలి అంటూ నేనొక్క‌డినే సినిమాలో అమ్మ గురించి భారీ డైలాగ్ ఒక‌టి చెబుతాడు మ‌హేశ్ బాబు. ఇప్పుడు ఈ డైలాగ్ శ్రీ‌దేవి కూతుళ్ల‌కు బాగా స‌రిపోతుంది. ఎందుకంటే చిన్న‌ప్ప‌టి నుంచీ ఇద్ద‌రూ అమ్మ కూచీలే. పెద్ద కూతురు ఝాన్వీ అయితే మరీనూ. అమ్మ‌ను వ‌దిలేసి ఒక్క రోజు కూడా ఉండ‌లేనంత ప్రేమ. అలాంటిది ఇప్పుడు అమ్మే లేదు. శ్రీ‌దేవి చ‌నిపోయిన త‌ర్వాత ఝాన్వీ బ‌య‌టికి క‌నిపించ‌కుండా లోలోప‌లే ఉండిపోతుంది. ఆమెను ఓదార్చ‌డానికి ఎవ‌రి త‌రం కావ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఝాన్వీ పుట్టిన‌రోజు వ‌చ్చింది. మార్చ్ 6న ఆమె 21వ పుట్టిన‌రోజు. అమ్మ లేకుండా జ‌రుగుతున్న తొలి పుట్టిన‌రోజును త‌లుచుకుని ఓ ఎమోష‌న‌ల్ క‌మెంట్ చేసింది ఝాన్వీ. నువ్వు లేక‌పోయినా నీ న‌వ్వు ఎప్పుడూ నాతోనే ఉంటుంది మా అంటూ ఝాన్వీ రాసుకొచ్చిన మాట‌ను చూసి అంతా క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ఇక ప్ర‌తీ ఏడాది మాదిరే ఈ సారి కూడా అనాథ శ‌రణాల‌యంలోనే ఝాన్వీ పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. బాలీవుడ్ ప్ర‌ముఖులు ఝాన్వీకి బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. ఇందులో సోన‌మ్ కపూర్, అన్షుల క‌పూర్, మ‌నీష్ మ‌ల్హోత్రా లాంటి వాళ్లు కూడా ఉన్నారు. మొత్తానికి అమ్మ లేని ఈ పుట్టిన‌రోజున ఝాన్వీ బాగా ఎమోష‌న‌ల్ అయిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here