ఝాన్వీ అప్పుడే వ‌చ్చేసిందిగా.. 


త‌ల్లిపోయిన బాధ‌లో ప‌ది రోజులుగా పుట్టెడు దుఖంలో ఉంది ఝాన్వీకపూర్. శ్రీ‌దేవి చ‌నిపోయినందుకు ఇండియానే బాధ ప‌డింది.. ఇక ఇంట్లో వాళ్ల బాధ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాలా..? అందులోనూ ఎప్పుడూ త‌ల్లితోనే ఉంటూ.. అమ్మ‌కూచీలా ఉండే ఝాన్వీకి త‌ల్లి మ‌ర‌ణం కోలుకోలేని షాక్. ఆమె ధ‌డ‌క్ షూటింగ్ లో ఉన్న‌పుడు ఈ విష‌యం తెలిసి అర్థాంత‌రంగా షూట్ కు బ్రేక్ ఇచ్చేసి వ‌చ్చేసింది. ఇది జ‌రిగి ప‌ది రోజులు అయింది. మ‌ధ్య‌లో అనుకోని బ్రేక్ తో షెడ్యూల్స్ కూడా బాగానే డిస్ట‌ర్బ్ అయ్యాయి. ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తుండ‌టం విశేషం. సైరాత్ సినిమాకు రీమేక్ గా ధ‌డ‌క్ రూపొందుతుంది. ఎన్నో క‌థ‌లు విన్న త‌ర్వాత త‌న కూతురును ఈ చిత్రంతో ఇండ‌స్ట్రీకి ప‌రిచయం చేయాల‌నుకుంది శ్రీ‌దేవి. అందుకే అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకుంది. కానీ పాపం ఇప్పుడు కూతురు తొలి సినిమా చూడ‌కుండానే పైకి వెళ్లిపోయింది. ధ‌డ‌క్ ను సూప‌ర్ హిట్ చేసి శ్రీ‌దేవికి మ‌రిచిపోలేని గిఫ్ట్ ఇస్తామ‌ని.. ఆమె ఆత్మ‌కు శాంతి క‌లిగేలా చేస్తామంటున్నాడు నిర్మాత క‌ర‌ణ్ జోహార్. మ‌రోవైపు త‌ల్లి లేని బాధ‌ను దిగ‌మింగుకుని ప‌ది రోజుల త‌ర్వాత షూటింగ్ కు వ‌చ్చింది ఝాన్వీక‌పూర్. ఆమె రాక‌తో సెట్ లో అంతా ఎమోష‌న‌ల్ అయిపోయారు. వ‌చ్చీరాగానే అంద‌ర్నీ చూసి ఏడుపు ఆపుకోలేక క‌న్నీరు పెట్టుకుంది ఝాన్వీ. ఆ త‌ర్వాత షూటింగ్ లో బిజీ అయిపోయింది. జులై 6న ఈ చిత్రం విడుదల కానుంది. శ‌శాంక్ కైథాన్ ధ‌డ‌క్ ను తెర‌కెక్కిస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. శ్రీ‌దేవి కోరుకున్న‌ట్లుగానే ఈ చిత్రంతో ఝాన్వీ ఎంట్రీ ఉంటుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here