టెంప‌ర్ చూపిస్తున్న ప్రియా వారియ‌ర్.. 

 
ప్రియా వారియ‌ర్.. ఈ పేరు ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా హాట్ సెన్సేష‌న్. నిండా 20 ఏళ్లు కూడా లేని ఈ భామ వెంట ఇప్పుడు కుర్రాళ్ళంతా పిచ్చోళ్ల మాదిరి ప‌డుతున్నారు. డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న ఈ ముద్దుగుమ్మ‌ నెల రోజుల కింది వ‌ర‌కు ఎవ‌రూ పెద్ద‌గా తెలియ‌దు. ఏదో ఒక మ‌ళ‌యాలం సినిమా చేస్తుంద‌నే విష‌యం మాత్ర‌మే తెలుసు.. అది కూడా అక్క‌డి మీడియాకు మాత్ర‌మే. కానీ ఒక్క పాట‌తో రాత్రికి రాత్రి ప్రియా ఓ సంచ‌ల‌నం సృష్టించింది. ఒరు ఆదార్ లవ్ లో మాణిక్యావి పాట‌లో ఈమె క‌నిపించే 27 సెక‌న్లు దేశాన్ని కొల్ల‌గొట్టేసింది. ఇన్ స్టాగ్రామ్ లో నెల కింద‌టి వ‌ర‌కు కేవ‌లం 2 ల‌క్ష‌ల 50 వేల మంది మాత్ర‌మే ఉన్న ఈమె ఫాలోయ‌ర్స్ 25 ల‌క్ష‌ల‌కు చేరిపోయింది.
ఒక్క నెల‌లో ఇంత మాయ ఎలా సాధ్య‌మైందో తెలియ‌దు. ఈమె ఇంట‌ర్వ్యూల కోసం నేష‌న‌ల్ మీడియా కూడా పోటీ ప‌డింది. ఇక ఏకంగా బిబిసి కూడా వ‌చ్చి ప్రియా ఇంట‌ర్వ్యూ తీసుకుందంటే పిచ్చి ఏం రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇప్పుడు ఈ భామ‌కు సినిమా అవ‌కాశాలు కూడా ఇలాగే వ‌స్తున్నాయి. తెలుగు నుంచి ప్రియాకు ఆఫ‌ర్లు వెళ్లినా.. ప్ర‌స్తుతం తాను చ‌దువుకుంటున్నాన‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. డిగ్రీ పూర్తయ్యే వ‌ర‌కు నో మూవీస్ అనే కండీష‌న్ పెట్టింది. అయితే ఇప్పుడు ఈ భామ కాద‌న‌లేని టెంప్టింగ్ ఆఫ‌ర్ ఒక‌టి వ‌చ్చింది. అదే హిందీ టెంప‌ర్ లో న‌టించే అవ‌కాశం. రోహిత్ శెట్టి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో ర‌ణ్వీర్ సింగ్ హీరో. సింబ టైటిల్ తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో కాజ‌ల్ పాత్ర కోసం ప్రియా వారియర్ ను అడుగుతున్నారు. ఆమె ఓకే అంటే బాలీవుడ్ ఎంట్రీ క‌న్ఫ‌ర్మ్ అయిపోయిన‌ట్లే. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎస్ చెప్ప‌లేదు.. అలాగ‌ని నో కూడా చెప్ప‌లేదు ఈ భామ‌. మ‌రి చూడాలిక‌.. ప్రియా హిందీలో టెంప‌ర్ చూపిస్తుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here