ట్యాక్సీవాలా.. ఏం చెప్పాల‌నుకున్నారు రాజా..?


విచిత్ర‌మైన పేర్లు పెట్టి ప్రేక్ష‌కుల్ని క‌న్ఫ్యూజ్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. టీజ‌ర్ల‌ను అదే పేరుతో విడుద‌ల చేయ‌కుండా ఇప్పుడు త‌మ క‌థ‌కు రిలేట్ చేసుకుంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు కొత్త పేర్లు పెట్టేస్తున్నారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ ఇంపాక్ట్.. స్టంప‌ర్.. ఓత్.. విజ‌న్.. పంచ్.. ఇలా ఒక్కో పేరుతో టీజ‌ర్లు రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఇదే రూట్ ఫాలో అవుతున్నాడు.
ఈయ‌న కొత్త సినిమాకు ట్యాక్సీవాలా టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. ఇందులో ట్యాక్సీ డ్రైవ‌ర్ గా న‌టిస్తున్నాడు విజ‌య్. అర్జున్ రెడ్డి త‌ర్వాత ఈయ‌న ఇమేజ్ బాగా పెరిగిపోయింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. రాహుల్ సంక్రీత్య‌న్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ 2..
యువీ క్రియేష‌న్స్ క‌లిసి నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ గేర్ విడుద‌లైంది. అంటే ఏంట‌ని కంగారు ప‌డకండి.. ట్యాక్సీవాలా క‌దా అందుకే ఫ‌స్ట్ గేర్ వేసాడన్న‌మాట‌. క‌థ‌కు సంబంధించినట్లుగానే టీజ‌ర్ కు బ‌దులుగా దానికి ఫ‌స్ట్ గేర్ అని పెట్టారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఇందులో ఏం చెప్పాల‌నుకున్నారో ఏమీ చెప్ప‌లేదు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఏదో ఓ టీజ‌ర్ విడుద‌ల చేయాలి కాబ‌ట్టి చేసారంతే. మే 18న ఈ సినిమా విడుద‌ల కానుంది. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. అర్జున్ రెడ్డితో రప్ఫాడించిన విజ‌య్.. ఈ చిత్రంతో ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here