ట్రంప్ కు చేరువ‌వుతున్న తెలుగు హీరోలు..

ACHARI AMERICA NITHIN FIDAA AMERICA SHOOTING

మ‌న హీరోల‌కు ఒక్కోసారి ఒక్కో దేశంపై మ‌క్కువ పెరుగుతుంటుంది. ఇప్పుడు అమెరికాపై మ‌న హీరోల దృష్టి ప‌డింది. సినిమా సినిమా అంతా అక్క‌డే తీసేయాల‌ని ఫిక్స్ అయిపోతున్నారు. ఆ మ‌ధ్య నాని నిన్నుకోరి సినిమా అక్క‌డే 70 శాతం షూటింగ్ చేసారు. సెకండాఫ్ అంతా అక్క‌డే జ‌రుగుతుంది. 2017 టాప్ హిట్స్ లో ఒక‌టిగా నిలిచిన ఫిదా కూడా స‌గానికి పైగా సినిమా అమెరికాలోనే జ‌రిగింది. సెకండాఫ్ మొత్తం యుఎస్ లోనే చిత్రీక‌రించాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. సాయిప‌ల్ల‌వి, వ‌రుణ్ తేజ్ పై అక్క‌డ వ‌చ్చే సీన్స్ అన్నీ చాలా బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఇక నితిన్ లై చిత్ర షూటింగ్ కూడా దాదాపు రెండు నెల‌ల పాటు అక్క‌డే చేసారు. హ‌ను రాఘ‌వపూడి తెర‌కెక్కించిన ఈ చిత్ర షూటింగ్ ట్రంప్ ట‌వ‌ర్స్ లో కూడా జ‌రిగింది.

ఇక ప్ర‌స్తుతం కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ న‌టిస్తున్న సినిమా షూటింగ్ కూడా స‌గానికి పైగా అక్క‌డే షూట్ చేసుకుని వ‌చ్చారు. ఈ చిత్రానికి ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ నిర్మాత‌లు. అంతేకాదు.. దీనికి క‌థ అందించింది కూడా మాట‌ల మాంత్రికుడే. ఇక మంచు విష్ణు కూడా ఆచారి అమెరికా యాత్ర పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ కూడా చాలా భాగం అమెరికాలోనే జ‌రిగింది. ఈ మ‌ధ్యే షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు వ‌చ్చారు. బ్ర‌హ్మానందం ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. జి నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌కుడు. దేనికైనా రెడీ లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత జి నాగేశ్వ‌ర‌రెడ్డి కాంబినేష‌న్ లో విష్ణు చేస్తోన్న సినిమా ఇది. ఆ మ‌ధ్య సాయిధ‌రంతేజ్ సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ కూడా దాదాపు అమెరికాలోనే షూట్ చేసారు. ఇప్పుడు మ‌న ఇండ‌స్ట్రీలో విదేశాల్లో షూటింగ్ అంటే ముందు అంద‌రికీ గుర్తొచ్చే దేశం అమెరికానే. ఇలా ప‌క్క‌నుండి ట్రంప్ కు మ‌న హీరోలు చుట్టాలైపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here