తాప్సీ అక్క‌డే ఫిక్స‌య్యేలా ఉందిగా..!

TAAPSEE BOLLYWOOD

చావో రేవో బాలీవుడ్ లోనే తేల్చుకోవాల‌ని ఫిక్సైపోయింది తాప్సీ. అవ‌కాశాలు వ‌చ్చినా.. పిలిచినా కూడా మ‌ళ్లీ సౌత్ కు వ‌చ్చే ఉద్ధేశం కూడా ఈ భామ‌కు లేన‌ట్లుంది. ప్ర‌స్తుతం ఈ భామ చేస్తోన్న సినిమాల లెక్క చూస్తుంటేనే ఈ విష‌యం అర్థ‌మైపోతుంది. బాలీవుడ్ లో తాప్సీకి మ‌ళ్లీ మంచి రోజులొచ్చాయి.

అక్క‌డ ఇప్పుడు నాలుగు సినిమాల‌తో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇందులో సూర్మా జులై 13న విడుద‌ల కానుంది. ఇండియ‌న్ హాకీ స్టార్ సందీప్ సింగ్ జీవితం ఆధారంగా షాద్ అలీ తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. కొన్నేళ్ల పాటు ఇండియాకు ఎన్నో విజ‌యాలు అందించిన సందీప్..

2006లో శ‌తాబ్ధి ఎక్స్ ప్రెస్ లో జ‌రిగిన గ‌న్ షాట్ లో గాయ‌ప‌డ్డాడు. కొన్నేళ్ల పాటు కుర్చీలోనే ఉన్న ఈయ‌న‌.. మ‌ళ్లీ ప‌ట్టుద‌ల‌తో తిరిగి టీంలోకి వ‌చ్చాడు. ఈ చిత్రంలో సందీప్ భార్య హ‌ర్ ప్రీత్ గా న‌టించింది తాప్సీ. ఇక దాంతోపాటు అమితాబ్ బ‌చ్చ‌న్ తో బ‌ద్లా.. అభిషేక్ బ‌చ్చన్ తో మ‌న్మ‌ర్జినియాన్.. ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్ తో ముల్ఖ్ సినిమాల్లో న‌టిస్తుంది. ఇవ‌న్నీ కానీ హిట్టైతే తాప్సీ అక్క‌డే హాయిగా సెటిల్ అయిపోవ‌చ్చేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here