తెలంగాణ‌కు ఫుల్ స‌పోర్ట్ చేస్తున్నారుగా.. 

SS Rajamouli
తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత మ‌న హీరోల్లో కూడా మార్పు వ‌చ్చేసింది. అప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ అంటే పెద్దగా ప‌ట్టించుకోన‌ట్లు ఉండే హీరోలు కూడా ఇప్పుడు జై తెలంగాణ అంటున్నారు. ఇక్క‌డేం కావాలో అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు ప్ర‌భుత్వానికి కూడా సాయం చేస్తున్నారు. ఇక్క‌డి ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో పాటు ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ తోనూ స్నేహ పూర్వకంగా ఉంటున్నారు. మొన్న తెలుగు మ‌హాస‌భ‌లు పెడితే స్టార్స్ అంతా క‌లిసి వెళ్లారు. ఇక ఇప్పుడు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల కోసం ఎన్టీఆర్, రాజ‌మౌళి లాంటి స్టార్స్ తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి కుర్ర హీరోలు కూడా స‌పోర్ట్ చేస్తున్నారు. వీళ్లంతా క‌లిసి ప్రజ‌ల‌ను చైత‌న్య‌ప‌రిచే యాడ్స్ లో న‌టించారు. ట్రాఫిక్ పోలీసులు చెప్పే నిబంధ‌న‌ల యాడ్ లో ఎన్టీఆర్.. రాజ‌మౌళి… విజ‌య్ న‌టించారు. దీన్ని రాజ‌మౌళి డైరెక్ట్ చేయ‌డం విశేషం. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న నేరాల‌ను అరిక‌ట్ట‌డానికి త‌మవంతుగా ఈ ప‌ని చేయ‌డానికి ముందుకొచ్చారు మ‌న స్టార్స్. మ‌రి రోజుకో రకంగా మోస‌పోతున్న మ‌న అమాయ‌క జ‌నం వీళ్లు చెప్పినందుకైన మారుతారో లేదో చూడాలిక‌..! ప్ర‌తీ థియేట‌ర్ లోనూ ఈ యాడ్స్ ప్లే కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here