తేజ్ ప్రేమ‌క‌థ బ‌య‌టికి వ‌స్తుందోచ్..!


అదేంటి.. సాయిధ‌రంతేజ్ కు సినిమాలు చేయ‌డానికే టైమ్ స‌రిపోవ‌డం లేదు.. మ‌ళ్లీ ఇప్పుడు ప్రేమించ‌డం.. ఆయ‌న ప్రేమ‌క‌థ బ‌య‌టికి రావ‌డం కూడా జ‌రుగుతుందా అనుకుంటున్నారా..? అవును.. ఇప్పుడు తేజ్ కూడా ప్రేమ‌క‌థ చెబుతున్నాడు. అది కూడా నాది చాలా మంది ప్రేమ‌క‌థ అంటున్నాడు. అస‌లు విష‌యం ఏంటంటే ఈయ‌న ప్ర‌స్తుతం క‌రుణాక‌ర‌ణ్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ స‌గానికి పైగా పూర్తైంది కూడా.
కానీ ఈ సినిమా టైటిల్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ‌ర్మ్ కాలేదు. రోజుకో టైటిల్ వినిపిస్తుంది కానీ ఏదీ క‌న్ఫ‌ర్మ్ కాలేదు. రెండేళ్ల కింద‌ నితిన్ చిన్న‌దాన నీ కోసం ఫ్లాపైన త‌ర్వాత క‌రుణాక‌ర‌ణ్ డిమాండ్ బాగా ప‌డిపోయింది. ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా కూడా తొలిప్రేమ ద‌ర్శ‌కుడు అనే ముద్ర ఇప్ప‌టికీ క‌రుణాక‌ర‌ణ్ ను కాపాడుతుంది. అందుకే ఇప్ప‌టికీ మ‌న హీరోలు అప్పుడ‌ప్పుడూ న‌మ్ముతున్నారు. సాయిధ‌రంతేజ్ హీరోగా ఈయ‌న తెర‌కెక్కిస్తోన్న సినిమాకు చాలా టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి.
ఓ సారి దేవుడు వ‌ర‌మందిస్తే అని.. మ‌రోసారి నా మ‌న‌సే అని.. ఇంకోసారి తేజ్.. ఐ ల‌వ్ యు అని వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏమో తేజ్ ది కూడా మంచి ప్రేమ‌క‌థ అనే టైటిల్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. మ‌రి వీటిలో ఏది క‌న్ఫ‌ర్మ్ చేస్తారో తెలియ‌దు. మ‌రోవైపు సాయిధ‌రంతేజ్ మాత్రం త‌న సినిమా టైటిల్ క‌న్ఫ‌ర్మ్ అయిన త‌ర్వాత తానే చెప్తాన‌ని చెప్పాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ ర‌న్ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. ఈ చిత్రంతోనైనా సాయి ఫామ్ లోకి వ‌స్తాడో లేదో..?
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here