తేజ్ వ‌స్తున్నాడు.. కానీ ఆల‌స్యంగా..!

అవును.. తేజ్ ఐ ల‌వ్ యూ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఈ చిత్రం జూన్ 29న విడుద‌ల కావాల్సింది. అప్పుడే అవుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం వారం రోజులు ఆల‌స్యంగా వ‌స్తున్న‌ట్లు తెలుస్తుంది. జులై 6కి తేజ్ ఐ ల‌వ్ యూ వాయిదా ప‌డింద‌ని వార్తలు వినిపి స్తున్నాయి. దానికి కార‌ణాలు ఇంకా తెలియ‌లేదు కానీ ఎందుకో నిర్మాత కేఎస్ రామారావు జూన్ 29 నుంచి వారం రోజులు ఆల‌స్యంగా తీసుకురావాల‌ని నిర్ణ‌యించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పాట‌లు కూడా ప‌ర్లేదు అనిపిస్తున్నాయి. సాయిధ‌రంతేజ్, అనుప‌మ మ‌ధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. ఇప్పుడిప్పుడే సినిమాపై పాజిటివ్ బ‌జ్ కూడా వ‌స్తుంది. ఇలాంటి టైమ్ లో స‌డ‌న్ గా మ‌ళ్లీ వాయిదా అంటే అభిమానుల్లో క‌ల‌వ‌రం మొద‌లవుతుంది. క‌చ్చితంగా ఈ చిత్రంతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాల‌ని చూస్తున్నాడు సాయిధ‌రంతేజ్. అలాగే క‌రుణాక‌ర‌ణ్.. అనుప‌మ‌.. కేఎస్ రామారావు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారిప్పుడు. అంద‌రికీ తేజ్ ఒక్క‌డే దిక్కయ్యాడు. మ‌రి చూడాలిక‌.. మావ‌య్య‌లా రావ‌డం కాస్త ఆల‌స్య‌మైనా రావ‌డం మాత్రం ప‌క్కా.. హిట్ కొట్ట‌డం కూడా ప‌క్కా అంటాడేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here